కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రెటీ వరకు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసందే. కాస్త బ్యాంక్ బాలెన్స్ ఉన్నవాళ్ళు, డబ్బున్న వారు నెల రెండు నెలలు ఏం చేయకపోయినా బండి నెట్టేయొచ్చు. కాని డైలీ కూలీలు ప్రతి రోజు ఏదో ఒక పని చేస్తే తప్ప సంపాదన లేని వారు, రెక్కాడితే గాని డొక్కాడని వారు ఈ పరిస్థితుల్లో అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. వారికి సాయం చేసేందుకు ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో పాటు రేషన్ బియ్యంను ఉచితంగా ఇస్తున్న విషయం తెల్సిందే. 
ఇక ఇందుకోసం చిత్ర పరిశ్రమలోని అనేకమంది చిత్ర పరిశ్రమలోని వారికి ఇతర సామాన్య ప్రజలకి అండగా లిచారు. తమ వంతి ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సొంత గ్రామస్తులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

 

తూర్పు గోదావరి జిల్లా మకిలిపురం మండలం మట్టపుర్రు గ్రామం సుకుమార్ సొంత ఊరు. ఆ ఊర్లో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు సుకుమార్ తన దాతృత్వంను చాటుకుంటున్నారు. గ్రామంలో డైలీ కూలీలకు సాయం అందించనున్నారు. గ్రామంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. మొత్తంగా అయిదు లక్షల రూపాయలను ఆయన గ్రామస్తులకు ఇవ్వబోతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. చాలామంది ఎంతో కొంత ఆర్ధిక సహాయం అందించి ఊరుకుంటారు. కానీ ఇలా సొంత వూరికి సహాయం చేయాలన్న ఆలోచన రావడం ఎంతో హర్షించదగ్గ విషయం.

 

ఇక ఇప్పటికే సుకుమార్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి పది లక్ష విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే. సినీ పరిశ్రమకు చెందిన పలువురు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. విభిన్నంగా దర్శకుడు సుకుమార్ తాను పుట్టి పెరిగిన గ్రామస్తులను ఆదుకునేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయం అంటూ ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఈ విషయం తెలిసిన తన గ్రామస్తులు ఆనందంలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: