వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా రకుల్ ప్రీతి సింగ్ ఆ సినిమా హిట్ అవడంతో మరిన్ని ఛాన్సులు అందుకుంది. యువ హీరోలతో చేస్తున్న టైంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో అమ్మడికి ఛాన్స్ ఇచ్చాడు. ఇక అప్పటినుండి వరుస స్టార్ సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్న రకుల్ అక్కడ కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. టాలీవుడ్ ఎంట్రీకి ముందే బాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకున్న అమ్మడు తెలుగులో స్టార్ అయ్యాక మళ్ళీ అక్కడ ఛాన్సులు అందుకుంది. 

 

అయితే తెలుగులో హాట్ గా అప్పుడప్పుడు మాత్రమే హాట్ గా కనిపించే రకుల్ హింది సినిమాల్లో మాత్రం రెచ్చిపోతుంది. అవసరం ఉన్నా లేకున్నా గ్లామర్ షో చేస్తుంది. అజయ్ దేవగన్ తో నటించిన దే దే ప్యార్ దే సినిమాలో రకుల్ అందాల ప్రదర్శన సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అక్కడ ఏమాత్రం మొహమాటం లేకుండా స్కిన్ షో చేసే రకుల్ తెలుగు సినిమాల్లో మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. బాలీవుడ్ లో శృతి మించేలా అందాలను గుమ్మరిస్తున్న రకుల్ మన దగ్గరకు వచ్చే సరికి కొన్ని షరతులు పట్టేస్తుంది. 

 

హిందిలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం అక్కడ విప్పడానికి ఏమాత్రం అడ్డు చెప్పని రకుల్ తెలుగు, తమిళ సినిమాల్లో పద్ధతిగా కనిపించాలని ప్రయత్నిస్తుంది. ఇక ఈమధ్య కెరియర్ లో పూర్తిగా వెనుకపడ్డ రకుల్ ఎలాగూ ఇక్కడ ఛాన్సులు లేవని ముంబై షిఫ్ట్ అయ్యింది. బాలీవుడ్ అవకాశాల కోసం చూస్తున్న ఈ అమ్మడు అక్కడ ఛాన్స్ వస్తే రెచ్చిపోయేందుకు రెడీ అంటుంది. మరి రకుల్ కు అక్కడ ఛాన్సులు దొరుకుతాయో లేదో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: