సినిమాలు, సీరియల్స్ తో పాటుగా ఈమధ్య వెబ్ సీరీస్ ల మీద ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ ఇప్పుడు అందరికి అందుబాటులో ఉండటం వల్ల అందరు వాటిలో సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ ల మీద ప్రత్యేక ద్రుష్టి పెడుతున్నారు. అక్కడ కూడా సినిమాలకు ఏమాత్రం తక్కువ కానీ కంటెంట్ తో వెబ్ సీరీస్ లు చేస్తున్నారు. కొత్తవారితోనే కాదు ప్రస్తుతం వెబ్ సీరీస్ లు చేసేందుకు స్టార్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం వీటిలో కూడా పోటీ ఏర్పడ్డదని చెప్పొచ్చు. ఇదిలాఉంటే తెలుగమ్మాయి ఈషా రెబ్బ అటు సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లు చేస్తుంది.

 

తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావు.. ఇవ్వరు అన్న పాత  మాటలన్నిటిని పక్కన పెట్టి అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటుంది. యువ హీరోలకు జంటగా నటిస్తున్న ఈ అమ్మడు వెబ్ సీరీస్ లో రెచ్చిపోతుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా లస్ట్ స్టోరీస్ తరహాలో తెలుగులో లవ్ స్టోరీస్ అంటూ ఒక వెబ్ సీరీస్ చేస్తున్నారు. ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. నాలుగు డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉండే ఈ వెబ్ సీరీస్ షూటింగ్ స్పాట్ నుండి ఈషా రెబ్బ పిక్స్ కొన్ని బయటకు వచ్చాయి. ఈ పిక్స్ లో ఈషా రెబ్బా స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ గా కనిపిస్తుంది. 

 

సినిమాల్లో రెచ్చిపోడానికి మొహమాట పడే ఈ అమ్మడు వెబ్ సీరీస్ లకు వచ్చే సరికి గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసినటు ఉంది. మడి కట్టుకు కూర్చుంటే అవకాశాలు వచ్చేస్తాయా చెప్పండి అందుకే ఈషా రెబ్బ కూడా హాట్ హాట్ గా రెచ్చిపోయేందుకు రెడీ అవుతుంది. ఈ వెబ్ సీరీస్ లో చూపించిన చొరవ ఏదో సినిమాల్లో కూడా చూపిస్తే ఈపాటికి అమ్మడి ఇమేజ్ డబుల్ అయ్యేదని అంటున్నారు. వరంగల్ నుండి వచ్చి హీరోయిన్ గా ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకున్న ఈషా రెబ్బా రాబోయే రోజుల్లో అయినా స్టార్ క్రేజ్ దక్కించుకోవాలని ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: