చైనాలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించి తన కోరల్ని మరింత విస్తృతం చేసి మనుషుల ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో రోజు రోజుకీ పెరుగుతున్నాయి. అత్యధికంగా కరోనా కేసులు నమోదయిన దేశంగా అమెరికా రికార్డుకెక్కింది. అయితే కరోనా ప్రభావం ప్రతీ పరిశ్రమపై తీవ్రంగా పడింది.

 

 

అన్ని షూటింగులు క్యాన్సిల్ అయి అందరూ ఇంట్లోనే కూర్చున్నారు. అయితే ప్రస్తుతం అత్యధికంగా చర్చించుకుంటున్న టాపిక్ కరోనా వైరసే. అందుకని ఈ వైరస్ గురించి సినిమా తీయాలని చాలామంది దర్శకులు భావిస్తున్నారట.  అయితే ఇదివరకే ఇలాంటి సినిమాలు హాలీవుడ్ లో చాలా వచ్చాయి. చాలా మంది పేర్లలో మొదటగా వినిపించిన పేరు ప్రశాంత్ వర్మ. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కరోనా వైరస్ గురించి సినిమా చేయాలని అనుకుంటున్నాడట. 

 

 

కరోనా వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లాక్ డౌన్ వల్ల తగ్గిపోతున్న ఎకానమీ, ఆర్థికంగా ఎలా చితికిపోతున్నామన్న అంశాలన్నీ ఆ సినిమాలో చూపిస్తాడట. అలాగే ఈ వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందింది అన్న అంశాలు కూడా ఉంటాయని అంటున్నాడు. ప్రశాంత్ వర్మ గతంలో అ సినిమా తీసి మంచి విజయం అందుకున్నాడు. 

 

 

 

కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే గత ఏడాది రాజశేఖ్హర్ హీరోగా కల్కి అనే చిత్రాన్ని తీసినప్పటికీ బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది. మరి కరోనా వైరస్ పై సినిమా చేయడానికి ఏ హీరో ముందుకు వస్తాడు, ఏ నిర్మాత డబ్బులు పెడతాడు.. తెలుగులో అలాంటి సినిమాలు ఆడతాయా అన్నది సందేహమే. చుడాలి మరి ఏం జరగనుందో..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: