టాలీవువ్ లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి2 తో ప్రపంచంలో టాలీవుడ్ స్ఠాయి ఏంటో చూపించారు.  ఈ మూవీ హిట్ తర్వాత గ్యాప్ తీసుకొని ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్‌)’ తో ముందుకు రాబోతున్నారు.  ఈ మూవీ లో రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రకు సంబందించిన ఓ టీజర్ రిలీజ్ చేశారు.  ప్రస్తుతం కరోనా ప్రభావంతో అన్ని షూటింగ్స్ బంద్ అయ్యాయి.  దేశంలో లాక్ డౌన్ నడుస్తుంది.  ఈ నేపథ్యంలో అన్ని సెట్ అయితే షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో టాప్ హీరోలు ఒక్కొక్కరి లీస్ట్ విడుదల చేస్తున్నారు.

 

ఈ మద్య సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు మరో సూపర్ స్టార్ నటించబో్తున్నట్లు సమాచారం. 'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్‌)లో తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా భాగమయ్యారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విజయ్‌ కి ఫోన్ చేసిన రాజమౌళి, తన చిత్రంలోని ఓ కీలకమైన పాత్ర గురించి చెప్పి, ఆ పాత్రను చేయాలని కోరగా, విజయ్‌ వెంటనే ఒప్పుకున్నారని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్, స‌ముద్ర ఖ‌ని తదితర భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే.

 

త్వరలో తదుపరి షెడ్యూల్ లోనే విజయ్ పాల్గొంటారని సినీ వర్గాలు అంటున్నాయి.  ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియ మూవీగా రాబోతున్న నేపథ్యంలో ఇద్దరు హీరోలకు ఇక జాతీయ స్థాయిలో మంచి పేరు రాబోతున్నట్లు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఎన్టీఆర్ లుక్.. టీజర్ బహుష మే 20 న రిలీజ్ చేస్తారేమో అని అంటున్నారు.  కరోనా ఎప్పుడు అంతం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: