ప్రస్థుతం ప్రపంచలోని 200 దేశాలలోని ప్రజల జీవితాలతో కరోనా ఒక ఆట ఆడుకుంటూ ఉంటే ఆ కరోనా వార్తలు తప్ప మరి ఏ వార్తలను పట్టించుకోలేని స్థితిలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఉంది. సాధారణంగా దక్షిణాది సినిమాలు అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ మీడియా హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో అనుసరించిన వ్యూహాలను చూసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్యపోతోంది.  

 

ఒక సినిమాను నిర్మించడం వేరు దానికి సరైన ప్రచారం కల్పించి ప్రమోట్ చేయడానికి కోట్ల రూపాయలలో ఖర్చు అవుతుంది. ప్రస్తుతం దేశం కరోనా సమస్యలతో సతమతమైపోతున్న పరిస్థితులలో ప్రజలు సినిమాల వార్తల గురించి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 


దీనితో పెద్దపెద్ద దిన పత్రికలు కూడ ప్రతిరోజు ప్రచురించే సినిమా పత్రిక లలోని వార్తలను బాగా తగ్గించి వేసాయి.  అయితే మార్కెటింగ్ టెక్నిక్స్ లో ఎప్పుడు కొత్తపుంతలు తొక్కుతూ ఆలోచనలు చేసే రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రచార విషయంలో కూడ కరోనా ను లెక్క చేయకుండా ఈ లాక్ డౌన్ పిరియడ్ ను ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రచారానికి తెలివిగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాడుకున్నాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 


సినిమా మొదలై  ఏడాదిన్నర కాలం దాటిపోయినా ప్రచార విషయంలో ఏమాత్రం పట్టించుకోని రాజమౌళి కరోనా సమస్యతో తెలుగు ప్రజలు మర్చిపోయిన ఉగాది పండుగను గుర్తుకు చేస్తూ మోషన్ పోష్టర్ తో రావడం ఆతరువాత చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో విడుదల చేయడంతో ఒకేసారి ప్రజలు వేలం వెర్రిగా ‘ఆర్ ఆర్ ఆర్’ మోషన్ పోష్టర్ ను చరణ్ వీడియోను చూసారు. దీనితో కరోనా సమస్యలతో జనం సతమతమై పోతున్నా సినిమాల ట్రైలర్స్ ను టీజర్లను చూస్తారు అన్న ఉద్దేశ్యంతో చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాలకు సంబంధించిన ప్రచారాన్ని కూడ ఈ లాక్ డౌన్ గ్యాప్ లో రూపాయి ఖర్చు లేకుండా చేసుకుని రాజమౌళి మార్గాలను అనుసరించ బోతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: