కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అన్ని దేశాలకు పాకింది. ప్రస్తుతానికి అమెరికాలో ఈ వైరస్ బారిన పడ్డ జనాభా ఎక్కువగా ఉన్నారు. చైనాని మించి లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఈ వైరస్ బారిన పడ్డవారికి వెంటిలేటర్లు చాలడం లేదని టాక్. వైద్యులు తమ ప్రాణాలని పణంగా పెట్టి అహోరాత్రులు కష్టపడుతున్నారు. అయినా కూడా పరిస్థితి ఇంకా అదుపులోకి రావట్లేదు.

 

 


ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా మొత్తం లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంటుంది. పనులు లేవు, పరిశ్రమలు మూతబడ్డాయి. దాంతో రోజువారీ కూలీలు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై యుద్ధం చేయడానికి ప్రభుత్వం ప్రజల నుండి విరాళాలు సేకరిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఇప్పటికే ఎంతో మంది స్పందించి తెలుగు రాష్ట్రాలతో పాటు పీఎమ్ రిలీఫ్ ఫండ్ కి విరాళాలు అందించారు.

 

 

అలా ఇచ్చిన వారిలో దర్శకుడు సుకుమార్ కూడా ఉన్నారు. సుకుమార్ తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వానికి పదిలక్షల సాయాన్ని ప్రకటించాడు. అయితే సుకుమార్ మరో అడుగు ముందుకు వేసి తన సొంత ఊరైన తూర్పు గోదావరికి చెందిన మట్టపర్రు గ్రామానికి ఐదు లక్షల సాయం అందించాడు.

 

 

 

 

 కరోనా వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా కర్ఫ్యూ కొనసాగుతున్న తరుణంలో పేద రైతు కూలీలు, డైలీ లేబర్స్ ఉపాధి కోల్పోవడం వలన నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితి కొనసాగుతుంది.కనుక అలాంటి పేదల సహాయార్ధం సుకుమార్ తన సొంత గ్రామానికి 5లక్షల సాయం ప్రకటించడంతో పాటు, మిగతా వారు కూడా ఆర్థిక సాయం చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: