ఆమె అందాల రాశి. గట్టిగా చెప్పాలంటే తన అందంతో చంపేసే అచ్చమైన రాక్షసే. ఉత్తారాది నుంచి దిగుమతి అయినా మతి పోగొట్టే అందం ఆమె సొంతం. పైగా చీర కడితే అచ్చమైన, స్వచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది. ఆ భామ ఇపుడు ఒక హిట్ కొట్టి కూడా ఆఫర్లు లేక ఆకలి మీద ఉంది.

 

ఆమె ఎవరో కాదు. లావణ్యా త్రిపాఠి. ఈ అమ్మడి పేరు ఇపుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్ అంటూ అప్పట్లో టాక్ నడిచింది. వకీల్ సాబ్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే క్యారక్టర్ లావణ్యా త్రిపాఠీ పోషిస్తుందని ప్రచారం జరిగింది. మరి ఏమైందో ఏమో అది కాస్తా వెనక్కి పోయింది.

 

పవన్ సినిమా చాన్స్ తో న‌క్కను తొక్కానని సంబరపడుతున్న లావణ్యానికి ఇది చేదువార్తగా మిగిలిందని అంటున్నారు. ఇదిలా ఉంటే లావణ్య ఇపుడు అబ్బాయి మూవీలో చాన్స్ కోసం ట్రై చేస్తోందని అంటున్నారు. ఆ అబ్బాయి ఎవరో కాదు వరుణ్ తేజ్. వరుణ్ తో కొత్త మూవీలో హీరోయిన్ గా లావణ్య పేరు పరిశీలిస్తున్నారని అంటున్నారు.

 

ఇంతకు ముందు మిస్టర్  అన్న  మూవీలో వరుణ్ తేజ్ తో లావణ్య చేసింది. ఆ మూవీ హిట్ కాకపోయినా మంచి పెయిర్ అనిపించుకున్నారు ఇద్దరూ. ఇపుడు మరోసారి వరుణ్ తో జత కట్టడానికి లావణ్య చూస్తోందిట. మరి అది ఫలిస్తే బాబాయి కాకపోయినా అబ్బాయి మూవీతోనైనా మళ్ళీ తెరపైన కనిపిస్తుందేమో చూడాలి.

 

ఇదిలా ఉంటే లావణ్య కు తెలుగులో మంచి హిట్లే పడ్డాయి. ఆమె నాగార్జునతో చేసిన సోగ్గాడే చిన్న నాయన మూవీ పెద్ద హిట్. ఆ తరువాత ఆమె చేసిన అనేక సినిమాలు బాగానే ఉందనిపించాయి. ఇక లేటేస్ట్ గా నిఖిల్ తో చేసిన మూవీ అర్జున్ సురవరం  కూడా హిట్ అయింది. అయితే లావణ్య కంప్లీట్ ట్రెడిషనల్ మూవీస్ కే పనికివస్తుందని ఒక టాక్ స్ప్రెడ్ అయింది.

 

అంతే కాదు, లావణ్య సీనియర్ హీరోల పక్కన నటించిన కారణంగా యంగ్ హీరోలు సైడ్ చేసేశారు. ఇక మిడిల్ రేంజి హీరోలు కూడా ఆమెను ఎందుకో పట్టుంచుకోవడంలేదు. దాంతో అన్నీ  ఉన్న అందమైన లావణ్య మాత్రం ఏమీ కాకుండా మిగిలిపోయిందని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: