ఇప్పటికే కరోనా వ్యాధి భయంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో వణికిపోతున్నాయి. ఈ వ్యాధి మరింతగా ప్రబలకుండా ఉండాలంటే ప్రజలు అందరూ కూడా సామజిక దూరాన్ని పాటించి 21 రోజుల పాటు తమ తమ ఇళ్లకు పూర్తిగా పరిమితం కావాలని దేశాన్ని లాకౌట్ చేస్తున్నట్లు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే దానివలన చాలామంది పేదవర్గాల వారు పనులు కోల్పోవడంతో, వారిలో కొందరికి తినడానికి సరిగ్గా తిండికూడా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. 

 

అయితే అటువంటి వారిని ఆదుకోవడానికి ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్ధిక ప్యాకెజీని ప్రకటించగా, మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమవంతుగా ఆర్ధిక సాయాన్ని, అలానే ఫ్రీ రేషన్ ని అందించడానికి సిద్ధం అయ్యాయి. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడం మా వంతు బాధ్యత అంటూ పలువురు సినిమా ప్రముఖులు సైతం ముందుకు రావడం విశేషంగా చెప్పుకోవాలి. దాదాపుగా చాలామంది నటీనటులతో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు కూడా తమవంతుగా తోచిన సాయాన్ని కరోనా బాధితులకు విరాళంగా అందిస్తున్నారు. 

 

కాగా నేడు కాసేపటి క్రితం యువ నటులు వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, శర్వానంద్, సీనియర్ హీరో రవితేజ, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థ, హీరోయిన్ లావణ్య తమవంతుగా వీలైన మొత్తాన్ని ఆర్ధిక సాయం అందించడంతో, మెగాస్టార్ చిరంజీవి వారందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అంటూ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ కరోనా భయంతో దేశదేశాలు అన్ని కూడా ఆర్ధికంగా సమస్యల్లో కూరుకుపోతున్నాయి, కావున ఇటువంటి కష్ట పరిస్థితుల్లో ఆర్ధికంగా అవకాశం ఉన్నవారు, ప్రజలకు తమకు వీలైనంత సాయం అందిస్తే వారికి చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం అని ఇటీవల మెగాస్టార్ కోరారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: