కరోనా మహమ్మారి ప్రభావానికి భారత్ వణికిపోతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. వ్యవస్థలన్నీ నిస్తేజమైపోయాయి. ప్రజలపై ప్రభావం చూపే అన్ని వ్యవస్థలనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపేసాయి. ఇందులో ఎక్సైజ్ శాఖకు ఏమాత్రం మినహాయింపు లేదు. ప్రతి చోటా మద్యం షాపులు మూసేశారు. అయితే.. ఓ వెటరన్ స్టార్ హీరో మాత్రం రోజులో కొంతసేపయినా మద్యం షాపులు తెరవాలని అంటున్నాడు. బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరో రిషి కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

 

 

’ప్రస్తుతం కరోనా ప్రభావంతో అందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. అసలేం జరుగుతుందో అనే టెన్షన్ లో ఉన్న కొందరికి రిలీఫ్ అవసరం అవుతుంది. అలాంటి వారికి రిలీఫ్ గా లిక్కర్ దొరికితే రిలాక్స్ అవుతారు. వీరిలో ప్రజా సేవలో నిమగ్నమైన పోలీసులు, డాక్టర్లు కూడా ఉన్నారు. ప్రభుత్వాలకు కూడా లిక్కర్ ద్వారా ఆదాయం వస్తుంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా లిక్కర్ బ్లాక్ మార్కెట్ లో దొరుకుతోంది. కాబట్టి లిక్కర్ అమ్మాకాలను లీగల్ చేస్తే ఇబ్బంది ఉండదు. నా మాటలను దయచేసి తప్పుగా తీసుకోవద్దు. ఇది నా ఆలోచన మాత్రమే’ అంటూ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

 

 

ఈ మెసేజ్ పై నెటిజన్లు పలు రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. కొందరు ‘మందు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి’ అంటే.. మరికొందరు.. ‘ఈ పరిస్థితి వల్లైనా మద్యానికి బానిసలైన కొందరు దానికి దూరమయ్యారు’, ‘బాధ్యత గత పౌరుడిగా బ్లాక్ మార్కెట్ గురించి చెప్పాలి కానీ లీగల్ చేయమనడం తగదు’, ‘ఆహరం అందించండి అని చెప్పండి మందు కాదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓపక్క కరోనా పరిణామాలను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: