ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమాలో తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా అద్భుతమైన నటనను కనబరిచి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న152వ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు ఇటీవల ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ అనుకోకుండా మాటల సందర్భంలో స్వయంగా లీక్ చేయడం జరిగింది. ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. 

IHG

ఇటీవల ఎంతో వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో బ్రేకులు పడక తప్పలేదు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే,  ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే నంటూ మొన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఒక పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేసింది. అదీకాక ఆ పోస్టర్ ని ప్రముఖ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో మెగాస్టార్ ఆచార్యదేవోభవ అద్భుతం అంటూ పోస్ట్ చేయడంతో అదే అఫీషియల్ లుక్ పోస్టర్ అని, ఎవరో దానిని సోషల్ మీడియాలో లీక్ చేసి ఉంటారని భావించి మెగాఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకోసాగారు. 

 

అయితే తమకు అందుతున్న సమాచారాన్ని బట్టి అది కేవలం ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే అని, కాగా దానిని ఒక మెగాభిమాని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా క్రియేట్ చేసి రిలీజ్ చేయడం, అది చాలా మందిని ఆకట్టుకోవడం, ఆపై ట్రెండ్ అవడంతో, బండ్ల గణేష్ కూడా అదే పోస్టర్ ని షేర్ చేయడం జరిగిందట. అయితే రాబోయే మరికొద్దిరోజుల్లో ఆచార్య సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుందని, అప్పటివరకు మెగాభిమానులు ఓపికపట్టాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: