టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ లో రష్మిక మందన్న ఒకరు. కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన ఈ అమ్మడు ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాగా ఆ సినిమా హిట్ అవడంతో ఆ నెక్స్ట్ వచ్చిన గీతా గోవిందం కూడా సెన్సేషనల్ హిట్ అయింది. అందుకే రెండు సినిమాలతో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ ఇయర్ మహేష్ పక్కన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు యువ హీరో సినిమా ఆఫర్ కాదన్నదట. 

 

స్టార్ డైరక్టర్ తో యువ హీరో.. అయితే వరుసగా మూడు నాలుగు ఫ్లాపులు తగిలాయి. ఆ సినిమాలో రశ్మికకు ఛాన్స్ వచ్చిందట. అయితే ప్రస్తుతం వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటున్న రష్మిక ఇలాంటి టైం లో యువ హీరో సినిమా.. అదికూడా ఫ్లాప్ లో ఉన్న హీరోతో చేయడం అనవసరం అనుకుంది. అందుకే అమ్మడు ఆ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. ప్రసుత్తం అమ్మడి ఫామ్ గురించి తెలుసుకుని ఆ సినిమా నిర్మాత 2 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినా సరే రష్మిక చేయనని చెప్పిందట. 

 

రష్మిక అలా చెప్పడం వెనుక రీజన్ పెద్దగా లేకున్నా నిజంగానే స్టార్ ఛాన్సులు వస్తున్నా ఇలాంటి టైం లో కేవలం రెమ్యునరేషన్ గురించి రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అంతేకాదు ఎలాగూ స్టార్ హీరోల సినిమాకు కోటిన్నర దాకా వస్తున్నాయి కాబట్టి యువ హీరోల ఆఫర్ రష్మిక కాదని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ సినిమాకు సైన్ చేసిన రష్మిక మరో రెండు స్టార్ ప్రాజెక్టులను అందుకుందని తెలుస్తుంది. ఈ ఏడాది కూడా వరుస స్టార్ ఛాన్సులతో అమ్మడు అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: