ప్రస్తుతం కరోనా పై మిగతా దేశాలతో పాటు మన దేశం కూడా యుద్ధం చేస్తోంది. ఇప్పటికే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాబోయే 21 రోజులపాటు దేశం మొత్తాన్ని పూర్తిగా లాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించడం ఒక్కటే ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి ఉన్న మార్గం అని, కావున ప్రజలు అందరూ కూడా ఈ సమయంలో తమ ఇళ్లకే పూర్తిగా పరిమితం అయి వ్యాధిని మరింతగా ప్రబలకుండా జాగ్రత్త వహించాలని కోరారు. 

 

అయితే దానితో ఒక్కసారిగా దిగువ, మధ్యతరగతి ప్రజలకు పనులు లేక ఇంట్లోని ఉండిపోవడంతో వారి జీవనోపాధి పూర్తిగా ఆగిపోయి, కొందరికి అయితే కనీసం తినేందుకు తిండి కూడా లేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దానిని అరికట్టేందుకు ఇప్పటికే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకెజీలు ప్రకటించడం జరిగింది. అయితే ఇటువంటి కష్ట సమయంలో మేము కూడా ప్రజలకు మావంతు సాయం అందిస్తాం అని మన టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుండి అనేకమంది ప్రముఖులు ముందుకు వచ్చి తమకు వీలైనంత మొత్తాన్ని సాయంగా ప్రకటించారు. అయితే ఈ కరోనా సంక్షోభం బారిన పడ్డ ప్రజలకు టాలీవుడ్ ప్రముఖుల్లో ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే.....!!

 

నగదు రూపంలో ఇచ్చిన వారు : --

 

ప్రభాస్ - రూ. 4 కోట్లు
పవన్ కళ్యాణ్ - రూ. 2 కోట్లు 
మహేష్ బాబు - రూ. 1.25 కోట్లు 
అల్లు అర్జున్ - రూ. 1.25 కోట్లు 
చిరంజీవి - రూ. 1 కోటి
నాగార్జున - రూ. 1 కోటి
దగ్గుబాటి ఫ్యామిలీ -  రూ. 1 కోటి 
రామ్ చరణ్ - రూ. 1 కోటి 
ఎన్టీఆర్ - రూ. 75 లక్షలు 
దిల్ రాజు, శిరీష్ -  రూ. 30 లక్షలు
నాగ చైతన్య - రూ. 25 లక్షలు 
రవితేజ - రూ. 20 లక్షలు
నితిన్ - రూ. 20 లక్షలు
వరుణ్ తేజ్ -  రూ. 20 లక్షలు
సాయి ధరమ్ తేజ్ - రూ. 20 లక్షలు
సి అశ్విని దత్  -  రూ. 20 లక్షలు 
మైత్రి మూవీ మేకర్స్ - రూ. 20 లక్షలు 
ఎస్. రాధాకృష్ణ - రూ. 20 లక్షలు 
త్రివిక్రమ్ శ్రీనివాస్ - రూ. 20 లక్షలు. 
శర్వానంద్ - రూ. 15 లక్షలు 
సుకుమార్ - రూ. 10 లక్షలు
కొరటాల శివ - రూ. 10 లక్షలు
అనిల్ రావిపూడి -  రూ. 10 లక్షలు
విశ్వక్ సేన్ - రూ. 5 లక్షలు 
వివి వినాయక్ -  రూ. 5 లక్షలు 
ఎస్ ఎస్ థమన్  - రూ. 5 లక్షలు 
సుధీర్ బాబు - రూ. 2 లక్షలు 
కార్తికేయ - రూ. 2 లక్షలు 
వెన్నెల కిషోర్ - రూ. 2 లక్షలు 
అల్లరి నరేష్  - రూ. 6 లక్షలు 
లావణ్య త్రిపాఠి - రూ. 1 లక్ష
ప్రణీత సుభాష్ - రూ. 1 లక్ష మరియు కొంత సరుకుల వితరణ 

 

నగదు రహిత డొనేషన్లు (సరుకులు, ఇతరాలు) : ---

 

నందమూరి బాలకృష్ణ, డాక్టర్ రాజశేఖర్, మంచు మనోజ్, నిఖిల్ సిద్దార్ధ, ప్రకాష్ రాజ్, శివాజీ రాజా, ప్రదీప్ మాచిరాజు...!!


 

మరింత సమాచారం తెలుసుకోండి: