టాలీవుడ్ యువ నటుడు నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం మరొక నటుడు సుధీర్ బాబు తో కలిసి వి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా తొలిసారిగా నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని బట్టి చూస్తే కొంత మనకు అర్ధం అవుతుంది. ఇక ఇటీవల విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ తో తన ఫ్యాన్స్ ని కొంత నిరాశపరిచిన నాని, ప్రస్తుతం తెరకెక్కుతున్న వి సినిమాతో తప్పకుండా మంచి సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్నారు. 

 

అలానే ఖచ్చితంగా ఈ సినిమాలోని తన క్యారెక్టర్ సాధారణ ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కు కూడా ఎంతో నచ్చుతుందని ఇటీవల నాని తెల్పడం జరిగింది. ఇక ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ నేపథ్యంతో షూటింగ్స్ పూర్తిగా బంద్ కావడంతో, కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటూ తన ఫ్యామిలీ మెంబెర్స్ తో ఎంతో సరదాగా గడుపుతున్న నాని, కాసేపటి క్రితం తన కుమారుడు జున్నుతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. 

 

ఆ వీడియోలో కొడుకు ముద్దుముద్దు మాటలను వింటూ మురిసిపోతున్న నాని, ఊరికే అలా జున్నుగాడితో అంటూ దానిని పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియో పై ఆయన ఫ్యాన్స్  అబ్బో, తన కొడుకుతో కలిసి నాని మాంచి ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నట్లున్నారు అంటూ సరదాగా సోషల్ మీడియా మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం తన కొడుకుతో కలిసి దిగిన మరొక ఫోటో పోస్ట్ చేసిన నాని, హ్యాపీ బర్త్ డే జున్ను అంటూ కుమారుడికి విషెస్ తెలిపారు. ప్రస్తుతం నాని పెట్టిన ఆ పోస్టులు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: