టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడుగా  పేరు తెచ్చుకున్న వర్మ తాజాగా సోషల్ మాద్యమాల్లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రాంగోపాల్ వర్మ దేశంలో ఉన్న కరోనా గురించి ఎన్నో సార్లు తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు.  తాజాగా ఆయన మరోసారి  తన సంచలన వ్యాఖ్యలతో సంచలనం రేపారు.  దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో అందరిలాగే చంద్రబాబు, లోకేశ్ కూడా ఇంటికే పరిమితమయ్యారని, ఇప్పుడు వాళ్లిద్దరూ అమెజాన్ ప్రైమ్ లో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా చూడాలని కోరుతున్నానని ట్వీట్ చేశారు. గత ఏడాది ఎన్నికల సందర్బంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ చేసి పలు సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. 

 

చంద్రబాబు నాయుడు ని కించపరుస్తూ ఈ మూవీలో చూపించారని.. ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా సినిమా ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు.  దాంతో అప్పట్లో ఎలక్షన్ కమిషన్ ఈ మూవీని పోస్ట్ పోన్ చేసింది.  అయితే ఏపిలో తప్ప ఇతర రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ చేశారు.  ఆ తర్వాత ఏపిలో వైసీపీ గెలిచిన తర్వాత ఈ మూవీ రిలీజ్ చేశారు.  తర్వాత కమ్మరాజ్యంలో కడప రెడ్లు అన్న మూవీ తీశారు.  ఈ మూవీ టైటిల్ వివాదం పెద్ద ఎత్తున చెలరేగడంతో తర్వాత ఈ మూవీ టైటిల్ మార్చారు. 

 

అమ్మరాజ్యంలో కడప రెడ్లు అని రిలీజ్ చేశారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.  ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ లో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా చూడాలని కోరుతున్నానని ట్వీట్ చేశారు. ఆ సినిమా చూసి వారిద్దరి విలువైన అభిప్రాయాలను ఫీడ్ బ్యాక్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ లో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్రం లింకును కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: