పూరీ జగన్నాధ్..రామ్  గోపాల్ వర్మ శిష్యుడు. ఆయన శైలి కూడా అలాగే ఉంటుంది. ఇక పూరీ అన్ని రకాల సినిమాలూ తీశారు. ఇస్మార్ట్ శంకర్ తో ఆయన మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. ఇపుడు ఫైటర్ మూవీని విజయ్ దేవరకొండతో తీస్తున్నాడు.

 

ఇవన్నీ ఇలా ఉంటే పూరీ లాక్ డౌన్ నేపధ్యంలో ఇరుక్కున్నారు. ఇపుడు ఎటూ షూటింగులు లేవు. దాంతో ఆయన ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా పూరీ  ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ ఫ్రీడం దొబ్బింది అని సెనేషనల్ కామెంట్స్ చేశారు. లాక్ డౌన్ విషయంలో ఆయన అన్న మాట ఇది. 

 


అయితే పూరీ ఇది సరదాగానే అంటున్నారు. ఇది మన మంచికోసమే పాలకులు తీసుకున్న నిర్ణయమని కూడా అంటున్నారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ అయిపోయిందని అనుకోవద్దని కూడా పూరీ చెబుతున్నారు. అది మే ఫస్ట్ వరకూ కావచ్చు, జూన్ ఫస్ట్ వరకూ కావచ్చు. మొత్తానికి కరోనా వైరస్ లేకుండా చేసిన తరువాతనే దేశం తలుపులు తెరుస్తుందని, దానికి జనమంతా ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అయిపోవాలని కూడా పూరీ పక్కా క్లారిటీగా చెప్పేస్తున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే పూరీ ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పుకొల్చారు. ఏళ్ళకు ఏళ్ళు సాగిన  సిరియా యుధ్ధాన్ని, దాని వల్ల అన్నీ పోగుట్టుకున్న అక్కడి బాధిత ప్రజల దైన్యాన్ని, స‌రిహద్దుల సైన్యం అగచాట్లను, బంగ్లాదేశ్ సరిహద్దుల జనాల కష్టాలు, అనాధల బాధలు, రోడ్డు పక్కన వారి ఇక్కట్లు, దేశంలో ఏ గుర్తింపూ  లేని బిక్షగాళ్ళ వ్యధలు కధల ముందు లాక్ డౌన్ పెద్ద సమస్య కానే కాదని పూరీ చెప్పుకొచ్చారు.

 

మనకు ఒక్క ఫ్రీడం లేదన్న బాధ తప్ప మనం మంచి పొజిషన్లోనే ఉన్నామని పూరీ చెబుతున్నారు. అందువల్ల ప్రభుత్వానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని, లాక్ డౌన్ మన మంచికేనని గుర్తించాలని మంచి మెసేజ్ ఇచ్చాడు. మొత్తం మీద పూరీ ఇచ్చిన ఈ సంసందేశంతోనైనా జనాలు రోడ్ల మీదకు రాకుండా ఉంటారేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: