బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా మంచి తనానికి ఆయన ఆయన నెంబర్ వన్ అంటారు.  ఇప్పటికీ స్టిల్ బ్యాచ్ లర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ దాతృత్వంలో ఎంతో గొప్ప హృదయం ఉన్నవాడని పలు సంఘటనలు రుజువు చేశారు. ఆయన స్థాపించిన ఛారిటీ సంస్థ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధ పిల్లలను ఆదుకొని కాపాడుతున్నారు.  ఎంతో మంది వృద్దులు లను చేరదీసి వారి జీవితం సంతోషంగా గడిపేలా చేస్తున్నారు.  తాజాగా కరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తన ఛారిటీ సంస్థ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. 

 

బాలీవడ్ షట్ డౌన్ కావడంతో ఐదు లక్షల మంది కార్మికులకు ఉపాధి నిలిచిపోయింది. అయితే బాలీవుడ్ లో మరీ దారుణమైన పరిస్థితిలో అంటే రోజు పనిచేసే సినీ కార్మికులు 25 వేల మంది వరకు కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్న సల్మాన్ ఖాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట.   సల్మాన్ ఖాన్ తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ను రంగంలోకి దింపారు.

 

బీయింగ్ హ్యూమన్ ప్రతినిధులు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యూఐసీఈ) కార్యాలయానికి వచ్చి ఆ పాతికవేల మంది కార్మికుల బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నారు. అయితే వారి వివరాలు పూర్తిగా తెలుసుకొని ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయాలన్నది సల్మాన్ ఆలోచన. ఆ పాతికవేల మంది యోగక్షేమాలు లాక్ డౌన్ ఉన్నన్నాళ్లు బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ చూసుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: