టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఇప్పటివరకు తన ఎంటైర్ కెరీర్ లో మొత్తంగా 350 పైచిలుకు సినిమాల్లో నటించారు. ఒక ఏడాదిలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా, అలానే ఒక రోజులో అత్యధిక పని గంటలు సినిమాల కోసం పని చేసిన వ్యక్తిగా, ఇక తెలుగు సినిమా పరిశ్రమకు అప్పట్లో ఎప్పటికప్పుడు వచ్చే ఎన్నో సరికొత్త హంగులను తీసుకువచ్చిన వ్యక్తిగా సూపర్ స్టార్ కృష్ణకు ఎంతో గొప్ప పేరుంది. తేనెమనసులు సినిమాతో ప్రారంభం అయిన కృష్ణ సినిమా ప్రయాణం, ఆ తరువాత మెల్లగా ఊపందుకోవడం, ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని వాటిని సక్సెస్ లు గా మలుచుకుని అప్పటి యువత, మాస్ లో అత్యద్భుతమైన పేరు, క్రేజ్ ని సంపాదించడం జరిగింది. 

 

అయితే కృష్ణ చూడడానికి ఎంత అందంగా అయితే ఉంటారో, ఆయన మనసు కూడా అంతే తెల్లగా అందంగా ఉంటుందని ఎందరో సినిమా ప్రముఖులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా తనతో కలిసి సినిమాలు చేసే దర్శకనిర్మాతలు బాగుంటేనే మనం బాగుంటాం అంటూ ఎందరికో ఉచితంగా సినిమాలు చేసిపెట్టిన గొప్ప మనసు కృష్ణది. అయితే దానివలన ఆయన ఆర్ధికంగా ఎంతో కోల్పోవలసి వచ్చిందని, మీరు ఎందుకు అటువంటి వారిని చూసి చూడనట్లు వ్యవహరిస్తారు అని తన సన్నిహితులు ఎందరు చెప్తున్నా, పోనీలెండి అంతా మనవారే కదా అంటూ వదిలేసేవారట కృష్ణ. అయితే దానివలన తన తండ్రి ఎదుర్కొన్న ఇబ్బందులను చూసిన నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి వలే ఎంతో గొప్ప సహృదయం కలవారని చాలామంది ఆయన సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ వారు చెప్తూ ఉంటారు. 

 

అయితే తండ్రి పరిస్థితిని దగ్గరుండి గమనించిన మహేష్, కెరీర్ మొదట్లో తండ్రి మాదిరిగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారని, అయితే రాను రాను పరిశ్రమ యొక్క అసలు పరిస్థితులు తెలుసుకుని ప్రస్తుతం, అవసరం ఉన్న పరిస్థితుల్లో తనవంతుగా సాయం అందిస్తున్నారని సీనియర్ విశ్లేషకులు ఒకరు ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. నిజానికి కృష్ణ వలె మహేష్ కి కూడా అందరికీ సాయం చేయాలని ఉంటుందని, అయితే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా మహేష్ ఎంతో జాగ్రత్తగా వ్యవరిస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: