నితిన్...కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ' సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగింది. 'జయం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే హిట్ అందుకొని ఫిలిం ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు హీరో నితిన్. 'జయం' సినిమా తరువాత వరుస ఆఫర్లతో దూసుకుపోయాడు. 'దిల్' సినిమాతో యూత్ కి బాగా దగ్గరైపోయాడు. ఇంక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై' చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 'శ్రీ ఆంజనేయం', ఆటాడిస్తా,టక్కరి, సత్యం శివం సుందరం, సంబరం, విక్టరీ, రామ్, ద్రోణ, హీరో, అడవి, రెచ్చిపో, సీతారాముల కల్యాణం లంకలో, మారో వంటి హిట్ సినిమాలలో నటించాడు. కానీ అన్ని సినిమాలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి. అన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సినిమాలలో నటించడం మాత్రం ఆపలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా విజయం కోసం ప్రయత్నిస్తూనే వచ్చాడు.

 

2012 లో వచ్చిన 'ఇష్క్' మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. 'ఇష్క్' సినిమా విజయం తర్వాత నితిన్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తరువాత విడుదలయిన 'గుండెజారి గల్లంతయ్యిందే', 'హార్ట్ ఎటాక్' సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' సినిమాను నిర్మించాడు. తనకు స్ఫూర్తి నిచ్చిన డైరెక్టర్ కరుణాకరన్ తో 'చిన్నదానా నీకోసం' లో నటించాడు. కొరియర్ బాయ్ కళ్యాణ్, అ ఆ, 'లై', శ్రీనివాస కల్యాణం చిత్రాల ద్వారా పలకరించాడు.

 

రీసెంట్ గా విడుదలైన భీష్మ సినిమాతో తన కెరీర్లోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ తో కలసి 'రంగ్ దే' చిత్రంలో నటిస్తున్నాడు. పుట్టినరోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, దానికి విశేష స్పందన వస్తోంది. ఆయన మరిన్ని విజయవంతమైన సినిమాల్లో నటించాలని, ప్రేక్షకులను ఇలానే అలరిస్తూ ఉండాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే టు నితిన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: