కరోనా వల్ల సినిమా షూటింగులన్నీ బంద్ అయ్యాయి. కరోనా మహమ్మారిని దేశం నుండి పారద్రోలేందుకు ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ను అందరు పాటిస్తున్నారు. ఇక ఇలాంటి టైం లో కొందరు తమలోని ఒరిజినల్ టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. అందులో భాగంగా కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ లాక్ డౌన్ టైం లో తన సొంత ఊరు వెళ్లి తన తండ్రితో పాటుగా దేవుళ్ళకు ఆభరణాలు తయారుచేసే పనిలో ఉన్నాడట. కెజిఎఫ్ సినిమాకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ లాక్ డౌన్ వల్ల తన సొంత ఊరు ఉడిపి దగ్గర కుందాపూర్ అట.

 

లాక్ డౌన్ ప్రకటించగానే ఫ్యామిలీతో సొంతూరు వెళ్లిన రవి తండ్రికి సాయం చేస్తూ దేవుళ్ళ ఆభరణాలు తయారు చేస్తున్నాడట. ఇందుకు గాను అతనికి రోజుకి 35 రూపాయల సంపాదన వస్తుందట. కెజిఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసి కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నా ఇలా తండ్రికి సాయపడుతూ 35 రూపాయలు సంపాదించడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు రవి బస్రూర్. కెజిఎఫ్ సినిమాలో అతని మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా హీరో ఎలివేటెడ్ సీన్స్ లో బీజీఎమ్ అదిరిపోయింది. ప్రస్తుతం కెజిఎఫ్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. 

 

లాక్ డౌన్ వల్ల సినిమాకు సంబందించిన పనులన్నీ పక్కన పెట్టి సొంతూరు వచ్చి ఇలా తన తండ్రికి హలో చేస్తున్నారు. తాను చేస్తున్న ఈ పనిని వీడియో తీసి తన సోషల్ బ్లాగ్ లో పెట్టుకున్నాడు రవి బస్రూర్. తనకు మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు రవి. చేస్తున్న పనిలో ఆనందాన్ని వెతుక్కోవడం కొందరి వల్లే అవుతుంది. బహుశా అందుకే రవి అందుకే కెరియర్ లో కూడా సక్సెస్ అయ్యేందుకు అది దోహదం చేసిందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: