బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ కరోనా వైరస్‌ ను ఎదుర్కొనేందుకు ఏకంగా 25 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా తాను ఎంతో గర్వపడుతున్నా అని తెలిపింది. తాజాగా మరో ఆసక్తికర వీడియోతో అభిమానులను కాస్త కలవరపెట్టింది అక్షయ్ భార్య, మాజీ హీరోయిన్ ట్వింకిల్‌.

 

ఆదివారం ఉదయం కారులో తాను హాస్పిటల్‌కు వెళుతున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది ట్వింకిల్. వీడియోతో పాటు ` ముంబై రోడ్లు ఎడారిని తలపిస్తున్నాయి. ఆసుపత్రి నుంచి తిరిగి వస్తున్నాము. ` అంటూ కామెంట్ చేసింది. వీడియోలో `సమయం ఆదివారం ఉదయం 10:31, దారులన్నీ ఎడారిని తలపిస్తున్నాయి. కేవలం పావురాలు, కాకులు మాత్రమే కనిపిస్తున్నాయి.

 

ఇతను నా డ్రైవర్‌ (అక్షయ్ కుమార్‌). మేము హాస్పిటల్ నుంచి తిరిగి వెలుతున్నాము` అంటూ తన కాలీకి కట్టిన కట్టును చూపించింది ట్వింకిల్‌. అంతేకాదు వీడియోలో పాటు `భయపడకండి, నాకు కరోనా వైరస్ రాలేదు. ప్రజలు ఆసుపత్రికి చాలా కారణాలతో వెళతారు. నాలా వెళ్లేవాళ్లు కూడా ఉంటారు. ఈ ఆదివారం నా భర్త జేబు ఖాళీ అయ్యింది. నా కాలు విరిగింది.` అంటే కామెంట్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Deserted roads all the way back from the hospital. Please don’t be alarmed, I am not about to kick the bucket because I really can’t kick anything at all! #sundayshenanigans

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

మరింత సమాచారం తెలుసుకోండి: