ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏ చిన్న గొడవ జరిగినా.. చెప్పుకోవడానికి దాసరి నారణయణరావు గారు ఉండేవారు. వారు స్వర్గస్తులయ్యాక ఇండస్ట్రీ పెద్ద దిక్కుని కోల్పోయింది. పరిశ్రమలో ఏర్పడే సమస్యలని తీర్చడానికి ఎవరు ముందుకొస్తారా అని అందరూ ఎదురు చూశారు. పెద్దన్న పాత్రని పోషించడానికి ఎవరైతే కరెక్ట్ అని ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వారందరికీ కనబడిన ఒకే ఒక్క ఆప్షన్ మెగాస్టార్ చిరంజీవి.

 

 

చిరంజీవి గారు తానెప్పుడూ పెద్దన్నలా ఉండాలని అనుకున్నాడో లేదో గానీ ప్రస్తుతం ఆయన చర్యలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. మా లో జరిగిన సమస్యలకి తగిన పరిష్కారం చూపడంలో ముందుండడం.. అలాగే ఏ చిన్న సినిమా ఫంక్షన్ కి పిలిచినా కాదనకుండా వెళ్ళడం.. అసలెలాంటి బజ్ లేని సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళి బజ్ తీసుకువచ్చే ప్రయత్నం చేయడం.. లాంటివన్నీ చూస్తుంటే ఇదంతా కరెక్టే అనిపిస్తుంది.

 

 

ఇక ఇప్పుడు కరోనా కారణంగా షూటింగులన్ని క్యాన్సిల్ అయ్యి స్టార్స్ నుండి డైలీ లేబర్లంతా ఇళ్ళకే పరిమితమైన నేపథ్యంలో రోజువారి సినీ కార్మికులకి సాయం చేయడానికి కరోనా క్రైసిసి ఛారిటీని ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్నాడు చిరంజీవి. సామాజిక దూరం పాటిస్తున్న ప్రస్తుత రోజుల్లో సామాజిక మాధ్యమం ద్వారా తన వాయిస్ ని వినిపిస్తున్నాడు.

 

 

 కరోనా క్రైసిస్ ఛారిటీ ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీలు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చిన సాయమే కాకుండా తమ సినీ వర్కర్లని కాపాడుకోవడానికి కూడా చేస్తున్న ప్రయత్నం అభినందించదగ్గది. ఈ ప్రయత్నాన్ని చిరంజీవి ముందుండి నడిపించడం వల్ల మరింత ఎక్కువ మంది స్పందిస్తున్నారు.  మహేష్ బాబు, ఎన్టీఆర్, శర్వానంద్.. ఇలా ప్రతీ ఒక్కరూ తమకి తోచినంత సాయం చేస్తున్నారు. ఈ ఒక్క విషయం చాలదా ఇండస్ట్రీకీ చిరంజీవే పెద్దన్న అని బల్లగుద్ది చెప్పడానికి.

మరింత సమాచారం తెలుసుకోండి: