అందాల భామ ప్రియాంక చోప్రా పలు యాక్షన్ చిత్రాల్లోనూ నటించిన సంగతి తెలిసిందే. డాన్ లాంటి సినిమాలో ఈ భాయ యాక్షన్ సీన్స్ ఇరగదీసింది. అయితే భవిష్యత్తు లోనూ ఈ భామ మరిన్ని యాక్షన్ చిత్రాలు చేయాలని భావిస్తుందట. `నేనెప్పుడు యాక్షన్‌ సీన్స్‌ డూప్‌ లేకుండా నేనే చేస్తాను. నాకు నా శరీరం మీద చాలా నమ్మకముంది. నేను కీడ్రాకారిణిని, నేను యాక్షన్‌  సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తాను. డాన్ క్వాంటికో లాంటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ కూడా చేశాను. భవిష్యత్తులో అలాంటి సినిమాలు మరిన్ని చేయాలనుకుంటున్నా` అంటూ ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూ లో కామెంట్ చేసింది.

 

అయితే యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా హీరోల డామినేషన్ కనిపిస్తోంది. `నేను ఆడ మగ అన్న తారతమ్యం లేని ప్రపంచాన్ని కోరుకుంటున్నా. నా జీవిత కాలంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా మామూలు సినిమాలు వ్యవహరించే రోజు వస్తుందని ఆశీస్తున్నా. మహిళా దర్శకులను కూడా దర్శకులు అనే రోజు వస్తుందని భావిస్తున్నా` అంటూ కామెంట్ చేసింది.

 

`నా పిల్లలకు ఈ బాధ ఉండకూడదని భావిస్తున్నా.. వారైన భారతీయ మహిళా క్రికెట్ టీం, మహిళా దర్శకురాళ్లు అనే పేర్లు వినకూడదని భావిస్తున్నా. మనం ఇది మేల్‌ ఓరియంటెడ్ సినిమా అని ఎప్పుడూ ప్రస్తావించం. కానీ మహిళల చిత్రాల విషయంలో మాత్రం ఎందుకు లేడీ ఓరియంటెడ్ సినిమా అంటాం.? ప్రస్తుతం మహిళలు తమ బంధనాల నుంచి బయటకు వస్తున్నారు. తల్లి దండ్రులు కూడా మహిళల స్వయం శక్తికి సహకరిస్తున్నారు. నా తల్లి దండ్రులు కూడా అన్ని విధాలుగా నాకు సహకరించారు.

 

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ భామ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వియ్‌ కెన్‌ బీ హీరోస్ పేరుతో వస్తున్న సూపర్‌ హీరో మూవీతో పాటు మరికొన్ని ఇండియన్‌, హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది ప్రియాంక చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: