యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కొంత కాలంగా వెంకటేష్ తో మూవీ చేయనున్నాడని కొద్దికాలంగా  వార్తలు వస్తున్న విష‌యం తెలిసిందే.  అయితే వెంకటేష్ కూడా తరుణ్ తో మూవీ ఉంటుందని గ‌తంలో ఒక‌సారి చెప్పడం జరిగింది. ఐతే తరుణ్ తీసుకెళ్ళిన స్క్రిప్ట్ వెంక‌టేష్‌కి పూర్తి స్థాయిలో నచ్చలేదు. దీంతో ఆయ‌న కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు సమాచారం. కాగా దీని పై డైరెక్టర్ తరుణ్ స్పష్టత ఇచ్చారు. వెంకటేష్ కొరకు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేశాను అని చెప్పిన ఆయన ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని చెప్పడం విశేషంగా ఉంది.

 

వెంకటేష్ నెక్స్‌ట్‌ మూవీ తరుణ్ తో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆయన‌ తమిళ చిత్రం అసురన్ తెలుగు రీమేక్ నారప్పలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా షూటింగ్ చాలా వరకు పూర్తైయింది. మ‌రి క‌రోనా మ‌హ‌మ్మారి రావ‌డంతో మ‌ధ్య‌లో కాస్త బ్రేక్ ఇవ్వ‌వ‌ల‌సి వ‌చ్చింది. లేదంటే ఈ సినిమా పూర్తి అయి ఈ పాటికి రిలీజ్ డేట్‌ని కూడా ఎనౌన్స్ చేసేవారు. ప్ర‌స్తుతం లాక్‌డ‌వున్ కార‌ణంగా సెల‌బ్రెటీలంద‌రూ ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఎవ్వ‌రూ షూటింగ్‌ల‌కి వెళ్ళ‌డం లేదు. ఎక్క‌డివ‌క్క‌డే ఆగిపోయాయి. ఇక ఈ చిత్రం త‌ర్వాత వెంక‌టేష్ త‌రుణ్‌భాస్క‌ర్ చిత్రం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 

 

ఇదిలా ఉంటే... త‌రుణ్ వెంకీకి స్పోర్ట్స్ డ్రామా క‌థని చెప్ప‌డం అది ఆయ‌న ఓకే అన‌డం ఏంటో అర్ధం కావ‌డం లేదు. గ‌తంలో వెంకీ చేసిన గురు చిత్రంలో ఆయ‌న కోచ్‌గా చేశారు. కాబ‌ట్టి ఆ మూవీ అంత‌లా హిట్ అయింది. మ‌రి ఈ చిత్రంలో త‌రుణ్ వెంకీని ఏ విధంగా చూపించ‌బోతున్నాడు. అన్న‌ది అంతా ఆశ‌క్తి క‌రంగా మారింది. ఈ వ‌య‌సులో ఆయ‌న్ని ప్లేయ‌ర్‌గా అయితే చూపించ‌లేరు. ఇక కోచ్‌గా అంలే ఆల్రెడీ మ‌నం చూసేశాం. మ‌రి త‌రుణ్ ఐడియా ఏంటో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: