ప్రస్తుతం కరోనా పేరు వింటే చాలు ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ చేస్తున్న నేపథ్యంలో జనాలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.  మొత్తం కర్ఫ్యూ పరిస్థితి కనిపిస్తుంది.  అయితే కొంత మంది మాత్రం ఈ లాక్ డౌన్ ని పాటించడం లేదు.  ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా పీఎం, సీఎం ఫండ్స్ కి దారాలంగా విరాళాలు ఇస్తున్నారు.  సెలబ్రెటీలు, భారత క్రికెటర్స్ అందరూ కరోనా బాధితుల కోసం విరాళాలు ప్రటిస్తున్నారు. తమ వంతు సాయిం చేస్తున్నారు.

 

ఇప్పటికే మన తెలుగు పరిశ్రమ నుంచి హీరోలు విరాళాలు ఇవ్వటం మొదలెట్టారు. మొదట హీరో నితిన్ రూ.20 లక్షల విరాళం తెలుగు రాష్ట్రాల సీఎం లకు ఇచ్చారు.  ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాన్, మహేష్ బాాబు, ప్రభాస్ ఇలా వరుసగా హీరోలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు సహాయాన్ని అందిస్తున్నారు.   తమకు చేతనైంతలో సినీ పరిశ్రమలో పనుల్లేక అవస్థలు పడుతున్న కార్మికులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలి మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తావన బయటకు రాలేదు.. ఈ సమయంలో  ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ తాజాగా రాజమౌళి ను ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడారు.

 

 

దానికి రాజమౌళి సమాధానమిస్తూ.. తమ కుటుంబం, ఆర్ఆర్ఆర్ యూనిట్ కరోనాపై పోరులో భాగమవుతోంది అని వివరించాడు రాజమౌళి.  డాక్టర్లు, పోలీసులకు ప్రొటెక్టివ్ కిట్లు భారీ ఎత్తున అందజేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించాడు. డాక్టర్లు ధరించే ప్రొటెక్టివ్ సూట్లు ఖరీదైనవని.. అది ఒక్క రోజు ధరించి పక్కన పెట్టేయాల్సి వస్తుందని.. ఈ కష్ట కాలంలో నాణ్యమైన సూట్లు భారీ ఎత్తున అవసరమని.. వాటిని 'ఆర్ఆర్ఆర్' యూనిట్ తరఫునే కాక వ్యక్తిగతంగా కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు  వెల్లడించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: