టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీకి సంబంధింన కొత్త అప్ డేట్ తో మెగా ఫ్యాన్స్ తెగ సంబరాలు జరుపుకుంటున్నారు.  ఇప్పటి వరకు ఈ మూవీ కి సంబంధించిన విషయాలు రక రకాలుగా వార్తలు వస్తున్నాయే తప్ప ఏది రియాల్టీ లోకి రాలేదు.  ఈ మూవీ దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఓ ప్రొఫెసర్ చేసే పోరాటం అని అంటున్నారు.  అయితే అతనికి ఓ ఫ్లాష్ బ్యాక్ అందులో నక్సలైట్ గా కనిపిస్తారని ఎన్నో రకాల కథనాలు వస్తున్నాయి.

 

ఇక ఆ నక్సలైట్ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని.. 30 నిమిషాల్ ఈ సీన్లు పీక్ లో ఉంటాయని అంటున్నారు.  ఏది ఏమైన ఊహాగానాలు ఎన్ని ఉన్నా ఈ మూవీ ఫస్ట్ లుక్ గురించి ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.    'ఉగాది' కానుకగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ వస్తుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. అలా నిరీక్షించినవారికి నిరాశే ఎదురైంది. ఈ సినిమా నుంచి 'శ్రీరామనవమి'కి ఫస్టులుక్ ను వదలాలనే ఆలోచనలో కొరటాల ఉన్నాడనేది తాజా సమాచారం. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఏప్రిల్ 2వ తేదీకి ఫస్టులుక్ ను రిలీజ్ చేసే పనిలోనే కొరటాల వున్నాడని అంటున్నారు.

 


మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇది చిరంజీవికి 153 వ సినిమా.. లేట్ గా షూటింగ్ మొదలైన ఈ షూటింగ్ కరోనా ఎఫెక్ట్ పడడంతో మరింత ఆలస్యం అవుతుంది.  చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే టాక్ వినిపించిన దగ్గర నుంచి, ఆయన ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా కరోనా తో ఇంటిపట్టున ఉంటున్న ఫ్యాన్స్ కి ఇది కాస్త ఊరట ఇచ్చే విషయమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: