మంచు భక్త వత్సలం నాయుడు ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు. కానీ మోహన్ బాబు అంటే అందరికీ తెలుస్తుంది. ఇక మోహన్ బాబు మంచి నటుడు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నాటి ఎన్టీయార్ నుంచి నేటి ప్రభాస్,  జూనియర్ ఎన్టీయార్  వరకూ అందరితో యాక్ట్ చేశారు. అన్ని తరాలూ చూశారు. మోహన్ బాబు వారసులు కూడా సినీ ఫీల్డ్ లో ఉన్నారు.

 

ఇదిలా ఉంటే మోహన్ బాబు, చిరంజీవిల మధ్య టామ్ జెర్రీ తరహాలో  అప్పట్లో కోల్డ్ వార్ నడచింది. సరిగ్గా పదమూడేళ్ళ క్రితం అంటే 2007న జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవంలో మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఓ రకమైన మాటల యుధ్ధం సాగింది. అయితే చిరంజీవి నేరుగా మోహన్ బాబుని విమర్శించలేదు. ఆయన తరఫున తమ్ముడు పవన్ వేదిక మీదకు వచ్చి మోహన్ బాబుకు ఘాట్ రిప్లయి ఇచ్చారు.

 

తమ్ముడూ మోహన్ బాబు అంటూ వెటకారంతో మాట్లాడారు. అది జరిగి ఇన్నేళ్ళు గడిచాయి. అయితే యూ ట్యూబ్ లో ఆ వాదోపవాదాలు అలా నేటికీ  భద్రంగానే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎవరైనా చూస్తే ఆ గొడవలు అలా బయటపడతాయి. ఇపుడు సీన్ మారింది. మోహన్ బాబు చిరంజీవి మంచి మిత్రులుగా ఉన్నారు. ఇద్దరూ తెల్లారిలేస్తే ట్విట్టర్ ద్వారా పలకరించుకుంటారు.

 

అయితే మోహన్ బాబు మీద అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన తనయుడు, హీరో మంచు విష్ణుని బాధపెట్టాయట. దాన్ని ఇన్నాళ్ళకు ఆయన ఓ చానల్లో  తన మనసులో బాధను అలా పంచుకున్నారు. ఆనాడు జరిగింది వేరు. నాన్నగారు (మోహన్ బాబు) చిరంజీవి గారి గురించి తప్పుగా ఏమీ అక్కడ సభలో  మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ అనవసరంగా స్పందించారేమోననిపించింది అంటున్నారు.

 

ఓ విధంగా పవన్ ఓవర్ గా రియాక్ట్ అయ్యారని కూడా విష్ణు అంటున్నారు. అలా ఎందుకు రియాక్ట్ అయ్యారన్నది పవన్ కే తెలియాలి. ఆయనే దానికి జవాబు చెప్పాలి అంటూ విష్ణు అంటున్నారు. అంటే పదమూడేళ్ళు అయినా కూడా మంచు లాంటి ఆ కుటుంబంలో పవన్ హాట్ కామెంట్స్ వేడిని పెంచుతూనే ఉన్నాయన్నమాట. ఏది ఏమైనా ఇక్కడ చిరంజీవి, మోహన్ బాబు కలసిపోయారు. అది మంచి పరిణామం. మిగిలిన వారు కూడా పాత వాటిని కెలక్కుండా ఉంటే బెటరేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: