రాధికా ఆప్టే.. తెలుగులో బాలయ్యతో కలిసి లెజెండ్ సినిమాలో కనిపించింది. రక్త చరిత్ర, ధోని, లయన్, కబాలి చిత్రాల ద్వారా టాలీవుడ్ లో సుపరిచితమే. తమిళనాడులో పుట్టిన రాధిక ఆఫ్టే.. ఇప్పటివరకు పలు తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ, మరాఠి, ఇంగ్లీష్ సినిమాల్లో నిటించింది. అంతేకాదు పలు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసింది. 2009లో ఆఫ్టే తీసిన బెంగాలి సినిమాతో ఆమెకు స్టార్ డమ్ వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు. పుట్టింది తమిళనాడు అయినా పెరిగింది, చదివింది అంతా పూణెలోనే. దీంతో కెరియర్ ప్రారంభంలో ఆఫ్టే కూడా అనేక ఒడిదుడుకుల్ని ఎదురుకొంది. ముంబైలో సినిమా ఛాన్సుల కోసం తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఓ మరాఠి సినిమాతో రాధిక దశ తిరిగింది. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. కానీ ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో మాంచి మసాలా వెబ్ సిరీస్ లలో.. పలు శృంగార ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ అభిమానులకు కాక పుట్టిస్తోంది.

 

ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌కు కరోనా వచ్చిందని టాక్ వచ్చింది. మీడియాలో ఆ వార్తలు గుప్పు మన్నాయి. సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. దీంతో ఇవాళ తాజాగా రాధిక ఆప్టే దీనిపై స్పందించింది. తనకు ఎలాంటి కరోనా లేదని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ భామ ఆస్పత్రిలో మాస్క్‌తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆమెకు కరోనా వచ్చిందంటూ పుకార్లు పుట్టించారు. ఇంకేముంది నిమిషాల్లో వార్తను వైరల్ చేసి పడేశారు. 'సోషల్ మీడియాలో నా పోస్ట్‌ చూసి చాలామంది నా ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతున్నారు. మెసేజ్‌లు చేస్తున్నారు. నా సన్నిహితురాలు ప్రెగ్నెసీ చెకప్‌ కోసం ఆసుపత్రికి వెళితే... తనకి తోడుగా వెళ్లానంతే’ అని రాధికా ఆప్టే తెలిపారు. ‘కరోనా వ్యాప్తి నుంచి నన్ను, ఇతరుల్ని కాపాడుకోవడానికి మాస్క్‌ ధరించా’ అని రాధికా ఆప్టే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: