ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, చరణ్ తో రూపొందిస్తున్న అతిపెద్ద మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందుతుంది. రౌద్రం రణం రుధిరం పై అంచనాలు పీక్స్ కి చేరాయి. ఇక ఇటీవ‌లె విడుదలైన ఆర్.ఆర్.ఆర్ మోషన్ పోస్టర్ మరియు చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలు సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. బాహుబలి స్థాయిలో. మరో విజువల్ ట్రీట్ రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్  రూపంలో ప్రేక్షకులకు ఆయన అందించనున్నాడని అర్థం అవుతుంది. కాగా ఆర్.ఆర్.ఆర్ మూవీలో చరణ్ లుక్ చరిత్రకు పొంతన లేకుండా సరికొత్తగా ఉంది. ఇక త్వరలో బయటికి రానున్న ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ సైతం దూరంగా ఉండే అవకాశం కలదు.

 

ఈ నేపథ్యంలో సామాజిక వాదులు మరియు చారిత్రక నిపుణులు ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించే అవకాశం ఉంద‌ని చెబుతున్నారు. చరిత్రలో గొప్ప పేరున్న ఇద్దరు వీరుల జీవిత కథను అవాస్తవంగా చూపించడానికి వారు ఇష్టపడరు. కాబట్టి వారు న్యాయస్థానం తలుపు తట్టే అవకాశాలు చాలానే ఉన్నాయ‌ని స‌మాచారం అంటారు. యథాతధంగా ఆర్.ఆర్.ఆర్ విడుదల చేయడం రాజమౌళికి సవాలు కానుందని కొంద‌రు అంటున్నారు. మ‌రి అలాంటి వాటిని రాజ‌మౌళి ఎలా ఎదుర్కొంటాడో వేచి చేడాలి.

 

మ‌రి ఎలా ఏ విధంగా ఇలాంటివ‌న్నీఉంటాయో ఇంకెన్ని ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుందో ఇలాంటి వ‌న్నీ కూడా జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. ఏద‌న్నా ఒక సినిమా మొద‌ల‌యితే చాలు ముందు అందులో ఏది వివాదం దొరుకుద్దా అని చూస్తారు నేటి యుగం ఏం చేస్తాడో ఏంటో రాజ‌మౌళి కేసు పెడితే ఏం చేస్తాడో ఏమో మ‌రి ఇలాంటి వేమి జ‌ర‌గ‌క‌పోతే బాగానే ఉంటుంది కానీ ఏ మాత్రం తేడా వ‌చ్చినా ఇక సినిమా క‌ష్టాలు త‌ప్ప‌వు. అందులోనూ అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుత‌ది కాబ‌ట్టి మ‌రింత జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: