కరోనా కల్లోలంతో యావత్ భారతదేం అతలాకుతలం అవడం తో ఈ మహమ్మారిపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి మద్దతుగా టాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్న ప్రముఖ సినీ తారలు పలువురు విరాళాలను ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాతిక కోట్లు విరాళంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించాడు. దీంతో బాలీవుడ్ మొత్తం అవాక్కవడమే కాదు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇదే విషయం లో కొందరు ఇతర హీరోలపై ఘాటుగా విమర్శలు కూడా చేస్తున్నారు.

 

ప్రముఖ హీరోలంటూ.. సూపర్ స్టార్ అంటూ దేశమంతటా గొప్పలు పోతున్న కొందరు హీరోలు ఇప్పటి వరకు కరోనా విపత్తు నేపథ్యంలో విరాళం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇంతవరకు స్పందించలేదు. దాంతో ఈ బాలీవుడ్ బాద్ షా ని బాగా కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా.. వ్యాపారవేత్తగా.. నిర్మాతగా ఇలా వివిధ రంగాలలో వందల వేల కోట్లను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు కరోనా విపత్తుకు తన సాయం అందించడం లేదు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 

ఐపీఎల్ కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు యజమానిగా భారీగా లాభాలను వెనకేసుకున్నాడు. అంత సంపాదన ఉన్నప్పటికి ఇంతవరకు సమాజం గురించి దేశం గురించి ఏమీ పట్టనట్టుగా ఉండటాన్ని బాలీవుడ్ జనాలు కొందరు తప్పు పడుతున్నారు. అయితే షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం చేసిన పని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గొప్పలు పోయో రకం కాదు. బయటకి చెప్పనంత మాత్రాన ఏ సహాయం చేయనట్టు కాదు కదా అంటూ రివర్స్ లో కామెంట్ చేస్తున్నారు. మరి షారుఖ్ విరాళం ఇచ్చి కుడా పబ్లిసిటి అవసరం లేదనంట్టుగా ఉన్నారా లేదా అన్నది ఆయన వెల్లడిస్తే గాని బయటకి రాదు.   

మరింత సమాచారం తెలుసుకోండి: