ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలను కూడా కరోనా వ్యాధి తీవ్ర సమస్యల్లోకి నెట్టేసింది. ఈ మహమ్మారి మరింత ప్రభలకుండా ఉండేందుకు ఇప్పటికే పలు దేశాలు పూర్తిగా కొన్నాళ్ల పాటు లాకౌట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలానే మన దేశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల పాటు లాకౌట్ ప్రకటించారు. పూర్తిగా ఇళ్లకు పరిమితం అయి, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకుని, ఇంటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే మంచిదని, ఆ విధంగా ప్రజలు పూర్తిగా తమ తమ ఇళ్లలోనే ఉండి, ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఆ మహమ్మారిని త్వరితగతిన మన దేశం నుండి తరిమి కొట్టవచ్చని మోడీ పిలుపునిచ్చారు. 

 

 

అయితే కరోనా వ్యాప్తి చెందకుండా చాలా మంది మన దేశ ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నప్పటికీ, అక్కడక్కడా కొందరు మాత్రం దానిని అలక్ష్యం చేస్తూ పెడచెవిన పెడుతున్నారు. అటువంటి వారిని ఎందరు అభ్యర్ధిస్తున్నా, ఆఖరికి పోలీసులు లాఠీ దెబ్బలు రుచి చూపిస్తున్నప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోతోందని, దయచేసి ఈ వ్యాధి యొక్క తీవ్రతను అందరూ అర్ధం చేసుకోవాలని పలువురు ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, ప్రముఖులు కోరుతున్నారు. 

 

అయితే ఈ వ్యాధిపై టాలీవుడ్ పరిశ్రమ నుండి ఇప్పటికే పలువురు నటీనటులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీడియోస్  చేస్తుండగా, మొన్న పూరి జగన్నాథ్ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ అందరినీ తమ తమ ఇళ్లలోనే ఉండమని, దేశానికి ఈ విధంగా మనం సేవ చేసే అవకాశం దొరికిదని కోరడం జరిగింది. ఇక నిన్న మరొక పోస్ట్ పెట్టిన పూరి, తరచూ స్మోకింగ్ చేస్తూ కరోనా మాకు రాదు అంటూ అలక్ష్యం చేసేవారిని హెచ్చరిస్తూ ఒక పోస్ట్ చేసారు. ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తారో, అటువంటి వారికి కరోనా వచ్చే అవకాశము ఎక్కువ ఉంది, సో బీ కేర్ఫుల్ అంటూ పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పూరి చేసినా ఆ పోస్ట్ పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: