అదేంటి కరోనా వల్ల షూటింగులే జరగట్లేదు. అలాంటిది బిగ్ బాస్ ఎలా మొదలవుతుంది. అయినా బిగ్ బాస్ సీజన్ 4 గురించి ఒక్క వార్త కూడా బయటకు రాకుండా ఎలా మొదలుపెడతారు. ఇంతకీ ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరు..? హోస్ట్ గా ఎవరిని తీసుకున్నారు..? ఈసారి హౌజ్ లో సెలబ్రిటీస్ ఎవరొస్తున్నారు..? ఇలాంటి ప్రశ్నలన్నీ మైండ్ లోకి వస్తాయి. ప్రస్తతం కరోనా ఎఫెక్ట్ తో మన ఇంట్లోనే బిగ్ బాస్ గేమ్ మనం ఆడుతున్నట్టు ఉంది. ఏప్రిల్ 14 వరకు ఎంత పలుకుబడి ఉన్న మనిషి అయినా సరే ఇంట్లో ఉండాల్సిందే. అయితే ఇలాంటి టైం లో క్యాష్ చేసుకునేందుకు బిగ్ బాస్ సీజన్ 3 ని రీ టెలికాస్ట్ చేస్తుంది స్టార్ మా. 

 

ఇదేదో కొత్తగా ఉంది కదా అనుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 3 హైలెటెడ్ ఎపిసోడ్స్ కొన్ని సెలెక్ట్ చేసి వాటిని మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. షూటింగులు బంద్ చేయడం వల్ల డైలీ సీరియల్స్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే ఇదివరకు ప్రోగ్రామ్స్ తో స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. అంతేకాదు టివి, పేపర్ వాళ్లకు యాడ్స్ కూడా తక్కువ అయ్యాయి. అందుకే ఆల్రెడీ టెలికాస్ట్ అయినా షోలు వేస్తున్నారు. ఈటీవీలో ఎప్పటిదో దసరా మహోత్సవం అంటూ ఒక షో రీ టెలికాస్ట్ చేశారు. 

 

అందుకే స్టార్ మా కూడా బిగ్ బాస్ షోలు టెలికాస్ట్ చేస్తుంది. మరి లాస్ట్ ఇయర్ జరిగిన సీజన్ 3ని మాత్రమే టెలికాస్ట్ చేస్తారా లేక బిగ్ బాస్ సీజన్ 1 నుండి 3 వరకు టెలికాస్ట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బిగ్ బాస్ అనగానే ఆడియెన్స్ లో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. మళ్ళీ ఆడియెన్స్ ను టివిల ముందు కూర్చోబెట్టాలని అనుకుంటున్నా స్టార్ మా ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: