అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో బన్నీ ఛరిష్మా మరింత బాగా పెరిగింది. నాన్ బాహుబలి హిట్ సొంతం చేసుకున్న బన్నీకి ఓవర్సిస్ లోనూ మార్కెట్ పెరిగింది. సంక్రాంతి కానుకగా వచ్చిన రెండు చిత్రాల్లో అల వైకుంఠపురములో చాలా క్లియర్ గా తన పైచేయిని చూపించింది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో బన్నీ నెక్స్ట్ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.

 

బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. రివేంజ్ డ్రామాగా సాగేఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడట. చిత్తూరు ప్రాంతంలో జరుగుతున్న ఈ కథ కోసం బన్నీ ఆ జిలా యాసని కూడా నేర్చుకున్నాడు. అంతే పూర్తి పల్లెటూరి కుర్రాడిగా మాస్ లుక్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు.

 

ఇంతకుముందెన్నడూ చూడని విధంగా మాస్ లుక్ లో కనిపించనున్నాడు. అయితే బన్నీ మేకోవర్ ఇంకా అవకముందే ఆయన ఫ్యాన్ సొషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ సినిమా ఫస్ట్ లుక్ ఇదేనంటూ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ని వదిలారు. అది ఎంత బాగా వచ్చిందంటే అధికారికంగా రిలీజ్ చేశారేమో అనిపించేంత బాగా వచ్చింది. గుబుతు గడ్డం, మెడలో తాయెత్తు చూడగానే లారీ డ్రైవరే అనిపించేలా ఉన్నాడు.

 

వెనకాల గంధపు చెట్లు కూడా ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్ టైటిల్ పోస్టర్ వచ్చిన నేపథ్యంలో తాము కూడా తమ హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నారో ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ద్వారా చెప్పారు.ఖచ్చితంగా ఇది చిత్ర యూనిట్ కళ్ళలో పడటం ఖాయం. ఇలాంటి పోస్టర్లు మేకర్స్ లో కొంచెం ఒత్తిడి పెంచుతాయి. అదే సమయంలో హీరోకి ఆనందాన్ని పంచుతాయి.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: