బాలీవుడ్ నటి సౌందర్య శర్మ ఇటీవల లాస్‌ ఏంజెల్స్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లింది. అయితే అదే సమయంలో కరోనా వైరస్‌ అవుట్ బ్రేక్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించటం తో ఆమె అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో కొద్ది రోజులుగా ఆమె అక్కడే బయటకు వెళ్లకుండా హోటల్‌ రూంకే పరిమితమైన ఆమె అక్కడే ఉన్న భారతీయల కోసం తన వంతు సాయం చేసేందుకు రెడీ అవుతోంది.

 

అక్కడ ఉంటున్న చాలా మంది భారతీయులు కరోనా అవుట్ బ్రేక్ కారణంగా ఉపాది కోల్పోయి ఇబ్బందుల పాలవుతున్నారు. వీరి కోసం ఫండ్ కలెక్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది సౌందర్య. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ `ఇది ప్రపంచానికే కష్టకాలం. ఈ సమయంలో మనమందరం మన వంతు సాయం చేయాలి. ఇంటికి దూరమైన నేను సిచ్యువేషన్‌ను అబ్జర్వ్ చేస్తున్న, ఈ సమయంలో అందరం కలిసి కట్టుగా ఉండాలి.

 

ప్రస్తుతం నేను లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటున్న కొంత మంది భారతీయులకు కూరగాయలు, మెడిసిన్స్ అందించేందుకు ప్రయత్నిస్తున్నా. అంతేకాదు ఆన్ లైన్‌ ద్వారా విరాళాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాను` అంటూ తెలిపింది. ఈ సందర్భంగా ఈ పరిస్థితులు త్వరలోనే చక్కబడాలని ప్రార్థిస్తున్నట్టుగా తెలిపింది. ప్రపంచమంతా ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలని ఆర్థికంగా, మానసికంగా ఈ మహమ్మారిని ఎదుర్కొనే ధైర్యం వారికి రావాలని ఆమె ఆకాంక్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: