కరోనా సమస్య పై టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోలకు సంబంధించి ఒక్క బాలకృష్ణ తప్ప అందరు స్పందించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు ఇవ్వడమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ కార్మీకులకు సంబంధించిన సిసిసి సంస్థకు కూడ భారీ మొత్తాలలో విరాళాలు అందచేసారు. 


తెలుగు అమ్మాయిలు కాని లావణ్య త్రిపాఠి ప్రణీత లు కూడ తమతమ స్థాయిలలో విరాళాలు అందచేస్తే ఇండస్ట్రీని శాసించిన నందమూరి కుటుంబం నుండి వచ్చిన బాలకృష్ణ ఈ విషయమై మౌనంగా ఉండటం బాలయ్య అభిమానులు కూడ తట్టుకోలేక పోతున్నారు. దీనికితోడు తెలుగుదేశం పార్టీకి చెందిన అనేకమంది ఎమ్ఎల్ఎ లు తమ జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తుంటే తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కొడుకు బాలయ్య మౌనంగా ఉండటం ఏమిటి అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 


ఈ విషయమై బాలకృష్ణ పై అప్పుడే సెటైర్లు కూడ పడిపోతున్నాయి. బాలయ్యకు యాగాలు హోమాలు అంటే బాగా నమ్మకం కాబట్టి ప్రస్తుతం లాక్ డౌన్ నేపధ్యంలో ఇంటికే పరిమితం అయిపోయిన బాలకృష్ణ ఎవరికీ అందుబాటులో లేకుండా తన రుద్రాక్ష మాలతో తపస్సు చేస్తున్నాడా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎందరో హేమాహేమీలు ఓడిపోయినా గత ఎన్నికలలో బాలకృష్ణ గెలిచి అందరికీ షాక్ ఇచ్చాడు. 


అయితే ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీకి బాలయ్య నాయకత్వం వహించాలి అని అతడి అభిమానులు కోరుకుంటున్న పరిస్థితులలో బాలయ్య తన మౌనం వీడి ప్రస్తుత సమస్యల పై స్పందించడం ద్వారా ఇండస్ట్రీలో అతడి గౌరవం పెరుగుతుంది అంటూ అతడి సన్నిహితులు కూడ భావిస్తున్నారు. అయితే ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా బాలకృష్ణ ఎవరికీ అందుబాటులోకి రాకుండా కొనసాగిస్తున్న మౌనం వెనుక ఎదో ఒక వ్యూహం ఉండి తీరుతుంది అని కొందరు భావిస్తూ ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ పరాభవం నుండి ఇప్పటికీ బాలయ్య తెరుకోలేకపోతున్నాడు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు..   

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: