ఫిలిం ఇండస్ట్రీలో సెంటిమెంట్లు చాలకీలకంగా పనిచేస్తూ ఉంటాయి.   ఇండస్ట్రీలోని వ్యక్తులు పాజిటివ్ సెంటిమెంట్లతో పాటుగా నెగెటివ్ సెంటిమెంట్లను కూడా బాగా నమ్ముతారు. ఇప్పుడు ‘వి’ సినిమా పై ప్రచారంలో ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ హీరో నానికి కలవరపాటుకు గురి చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. 


ఫిలిం ఇండస్ట్రీ సెంటిమెంట్స్ ప్రకారం పలుసార్లు వాయిదా పడిన సినిమాల్లో అధికశాతం ఫ్లాపులుగా నిలుస్తాయి అని అంటారు. నాని సుధీర్ బాబుల  ‘వి’ కి కూడా ఈనెగెటివ్ సెంటిమెంట్ గండం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది.  వాస్తవానికి ఈ మూవీని సినిమా ఇండస్ట్రీ లాక్  డౌన్ ప్రకటించక ముందే ఒకసారి వాయిదా పడింది. 


అప్పటికి ఈ మూవీకి సంబంధించిన వర్క్ పెండింగ్ ఉండడంతో వాయిదా వేయవలసి వచ్చి అన్ని లెక్కలు చూసుకుని గత వారంలో వచ్చిన ఉగాది అన్ని విధాల కలిసి వస్తుంది అన్న అంచనాలు వేసుకున్నారు. అయితే కరోనా సమస్యతో  లాక్ డౌన్  ప్రకటించడంతో  ఈ మూవీ వాయిదా పడి ఏప్రిల్ లో రిలీజ్ కావడం కూడా సందేహంగా మారింది.  ఇలా వాయిదా పడిన సినిమాలకు సాధారణంగా  క్రేజ్ తగ్గి పోతుంది. ఇలాంటి నెగెటివ్ సెంటిమెంట్ ను తప్పించుకుని హిట్ కావడం సాధారణమైన విషయం కాదు అన్న అభిప్రాయాలు కూడ ఉన్నాయి.   


ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తారో లేదో అనే అంశం చాలమందికి సందేహంగా ఉంది. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితులు నెగెటివ్ సెంటిమెంట్ అన్నీ దాటుకుని ‘వి’ విజయం సాధిస్తుందా ? అంటూ జరుగుతున్న నెగిటివ్ ప్రచారం ఒక విధంగా నానీని కలవార పెట్టే విషయం. క్రితం సంవత్సరం నాని నటించిన ‘జెర్సీ’ మూవీకి మంచి పేరు వచ్చినా కలక్షన్స్ పరంగా నాని కోరుకున్న అద్భుతాలు జరగలేదు. ఇక నాని ఎన్నో ఆసలు పెట్టుకుని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ ఫ్లాప్ గా మారింది. దీనితో నాని మార్కెట్ పడిపోకూడదు అని భావిస్తే ‘వి’ ఖచ్చితమైన విజయం సాధించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: