కరోనా వైరస్.. ఎంత ప్రమాదకరమైన.. రక్షేసి వైరస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ వైరస్ ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా రోజుకు కొన్ని వేలమంది మృతి చెందుతున్నారు. కొన్ని లక్షలమంది ఈ వైరస్ బారిన పడి కరోనాతో పోరాడుతున్నారు. అలాంటి ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ విధించింది. 

 

దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఉపాధి లేక కష్టాలు పడుతున్నారు. దీంతో రాష్ట్రానికి, దేశానికి ఎవరికి తోచినంత వారు విరాళాలు ఇస్తున్నారు. ఇక ఈ తరహాలోనే సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోవడం వల్ల కొన్నివేల మంది సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు.. వారిని ఆదుకోవడానికి తెలుగు సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలో తెలుగు సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డానికి ''సీసీసీ మ‌న‌కోసం'' చారిటీ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ ఛారిటీకి ఎంతోమంది తెలుగు సినీ హీరోలు సహాయం చేశారు. ఎంతో మంది విరాళాలు ఇచ్చారు. అయితే ఈ చారిటికి మాత్రం ఎవరు కూడా హీరోయిన్స్ మ‌ద్ద‌తు ఇవ్వలేదు. ఇందుకు ఓ కారణం ఉంది.. వారు అంత మన తెలుగు హీరోయిన్స్ కాదు.. పక్క రాష్ట్రాల హీరోయిన్లు అందుకే మన తెలుగు సినీ కార్మికుల కోసం ఎవరు ముందుకు రావడం లేదు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కమెడియన్ బ్రహ్మాజీ ఈ విషయంపై మాట్లాడుతూ.. ''ముంబైకి చెందిన ఎంతోమంది హీరోయిన్స్ ఇక్క‌డ ప‌నిచేస్తున్నారు. అంద‌రూ స్టార్ హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు. అయితే వారెవ‌రూ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన చారిటీ కోసం స్పందించ‌కపోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. లావ‌ణ్య త్రిపాఠి వంటి వారు మాత్రమే స్పందించారు'' అంటూ అయినా ఫైర్ అయ్యారు. అయితే నిజానికి ఈ మాటల్లో ఏ మాత్రం తప్పు లేదు. తెలుగు వారి వల్ల బాగుపడుతున్నారు కానీ.. తెలుగు వారి కోసం స్పందించడం లేదు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: