హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య ఏదైనా సోష‌ల్ మీడియాలో ఒక చ‌ర్చ మొద‌ల‌యిందంటే చాలు దానికి ఒక అంతూ పొంతూ లేకుండా పోతుంది. అక ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వెళ‌తాయో కూడా మ‌నం చెప్ప‌లేం ఒక్కోసారి అంత ఘాటుగా కూడా ఉంటాయి. అందులోనూ ఇప్పుడు అంద‌రూ లాక్‌డౌన్‌లో ఉండ‌టంతో ఖాళీగా ఉండి ఇదే ప‌నిలో ఉన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఎక్కువ శాతం నెట్టింట్లోనే ఉంటున్నారు. ఇక ప‌నేముంది ఒక‌రినొక‌రు ఆడుకోవ‌డ‌మే ప‌ని. ఇక ఇటీవ‌లె విడుద‌లైన ఆర్.ఆర్.ఆర్ రామ్‌చ‌ర‌ణ్ వీడియోకి, సైరాకి ముడిపెట్టి మ‌రీ ర‌చ్చ లేపుతున్నారు.

 

రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌ను ఎన్టీఆర్ ప‌రిచ‌యం చేస్తూ ఇచ్చిన వాయిస్ ఓవ‌ర్ చాలా బావుందంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అలాగే సైరాకి ప‌వ‌న్ ఇచ్చిన వాయిస్ కంటే ఈ వాయిస్ చాలా బావుందంటున్నారు. ఇక చిరు సినిమాకి త‌న త‌మ్ముడే మైన‌స్ అన్న రేంజ్‌లో ఈ వాదోప‌వాదాలు న‌డుస్తున్నాయి. రామ్ చరణ్ సినిమాకి నందమూరి హీరో ప్లస్ అయ్యాడని అంటున్నారు. ఒకరకంగా మెగాభిమానులను రెచ్చగొడుతున్నార‌నే చెప్పాలి.

 

ఇక ఇక్క‌డ మెగాభిమానులు అనడం కంటే.. పవన్ అభిమానులు అనడమే క‌ర‌క్ట్ అని చెప్పాలి.ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం మొదలైనప్పటి నుంచి ఇటు మెగా అభిమానుల మ‌ధ్య‌, నందమూరి అభిమానుల మధ్య ఒకరకమైన బాండింగ్ ఏర్పడింది. సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంలో కూడా ఇద్దరు హీరోల అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వీడియో కూడా అంతే అని చెప్పాలి. అయితే ఈ వీడియోలో రామ్ చరణ్ కనిపించి ఫ్యాన్స్‌కి క‌నువిందు చేస్తే, ఎన్టీఆర్ వినిపించి వాళ్ళ అభిమానాన్ని ద‌క్కించుకున్నాడు.

 

అలా ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ రాజమౌళి చేసిన ప్లానింగ్ మంచి ఫలితాన్నిచ్చింది. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ వాయిస్‌ని మాత్రం కేవ‌లం క్రేజ్ కోసం తీసుకున్నారు. అది కూడా ఒక‌ర‌కంగా చెప్పాలంటే హెల్పే అయింది. ఎన్టీఆర్ డైలాగ్స్ తో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓ రేంజ్ లో ఉండే సరికి పోలిక మొదలైంది. అయిన ఈ అభిమానులు ఉన్నారే వాళ్ళు అస‌లు మాములు వాళ్ళు కాదండి బాబూ.

మరింత సమాచారం తెలుసుకోండి: