వెండితెర మీద హీరోలు అద్భుతాలు సృష్టిస్తారు.. సినిమా జానర్ ఎలాంటిదైనా సరే హీరో అంటే హీరోనే.. ఆయనకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఇక కొన్ని సినిమాల్లో హీరోకి సూపర్ పవర్స్ ఉంటాయి. అవి వాటితో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కుంటారు. అయితే నిజ జీవితంలో సినిమాలో సమస్యలా సూపర్ పవర్స్ తో చేయడం ఉండదు. అంతేకాదు రీల్ లైఫ్ లో హీరో అనిపించుకున్న ప్రతి ఒక్కరు రియల్ లైఫ్ లో హీరోలు అవుతారనే నమ్మకం లేదు. కానీ తమని ఆదరిస్తున్న ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా మేమున్నాం అంటూ వచ్చే సినీ స్టార్స్ మాత్రం నిజమైన హీరోలే అని చెప్పొచ్చు.

 

కష్టం అది ఎవరిదైనా సరే తమ వంతు బాధ్యతగా ఆ కష్టానికి తగ్గట్టుగా వారి స్టెప్ ఉంటుంది.కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎప్పుడు ముందుంటారు స్టార్స్. అతనకుముందు చాలాసార్లు ఇది ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల నిరాశ్రయులుగా మారిన వారికి ఆసరాగా ఉంటున్నారు సిని స్టార్స్. సమాజంఫై బాధ్యతతో తమ తోటి కళాకారుల కష్టాన్ని గ్రహించి వారు మంచి పనులు చేస్తున్నారు. కరోనాను పారద్రోలేందుకు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సపోర్ట్ గా విరాళాలు ప్రకటించిన స్టార్స్. తెలుగులో ప్రత్యేకంగా సినీ కార్మికుల కోసం సీసీసీ అంటూ ఒక ప్రత్యేకమైన చారిటీ ఏర్పరిచారు. 

 

చిరు ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. వాళ్ళ సినిమా మనం చూస్తున్నాం కాబట్టే వారికి ఇంత క్రేజ్.. అయినా మనం డబ్బులు పెట్టి వాళ్లకు ఎందుకు క్రేజ్ తీసుకురావాలి అనుకునే వారికి ఇదే సరైన సమాధానం. కష్టం వచ్చినప్పుడు ఆ ప్రజలకు అండగా ఉంటూ వారి గొప్ప మనసుని చాటుకుంటున్నారు మన స్టార్స్. అందుకే వారు కేవలం రీల్ హీరోస్ మాత్రమే కాదు రియల్ హీరోస్ అని అనేయొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: