పునర్నవి భూపాలం.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గత ఏడాది టెలికాస్ట్‌ అయిన బిగ్ బాస్ షో ద్వారా ఈమె ఎంత‌ పాపులర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. బిగ్‌బాస్ 3 ద్వారా మంచి ఫేమ్‌ను సంపాదించుకున్నారు నటి పునర్నవి. ముఖ్యంగా హౌస్‌లో రాహుల్‌తో కలిసి పునర్నవి చేసిన రొమాన్స్‌ను ఫ్యాన్స్ ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. 

IHG

వాస్త‌వానికి ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పునర్నవి. అలాగే శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో హీరో కూతురుగా కూడా మెరిసింది. ఆ త‌ర్వాత‌ పిట్టగోడ, ఎందుకో ఏమో, ఈ సినిమా సూపర్‌హిట్టు వంటి చిత్రాల్లో నటించింది. కాని, బిగ్‌బాస్‌ షో తో సోషల్‌మీడియాలో పునర్నవి ఫాలోవర్ల జాబితా అమాంతం పెరిగిపోయింది. 

IHG

ఇక హౌస్ నుండీ బయటకి వచ్చిన వెంటనే.. పున‌ర్న‌వి, రాహుల్‌ పెళ్ళి చేసుకుంటారు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే.. అంటూ వీరిద్దరూ ఆ వార్తలను కొట్టిపారేశారు. మ‌రోవైపు ఈ బ్యూటీ త‌న లుక్స్‌తో ఎప్ప‌టికప్పుడు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇస్తూనే ఉంటుంది.

IHG

గతంతో పోలిస్తే ఈ మధ్య ఆమె ఎంతో యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. అంతేకాదు, తన వ్యక్తిగత కెరీర్ సంబంధిత విషయాలను పంచుకుంటోంది. అలాగే తరచూ గ్లామర్‌గా కనిపిస్తూ కూర్ర‌కారు మ‌తిపోయాలే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా కూడా పునర్నవికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

IHG

ఈ ఫోటోలు చూస్తే నిజంగా మ‌తిపోవాల్సిందే. దీంతో చాలా మంది ఆమె అందానికి ముగ్ధులై ఆహా.. ఓహో.. హాట్ బ్యూటీ అంటూ కామెంట్ బాక్స్‌ని ఫిల్ చేసేస్తున్నారు. ఏదేమైనా పున్నూ అద‌ర‌గొట్టేసింద‌ని చెప్పాలి. మ‌రి ఆ ఫోటోల‌పై మీరు ఓ లుక్కేసేయండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: