ప్రస్తుతం ఇండియా వైడ్ గా హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో భారతీయుడు2 ఒకటి. 24 ఏళ్ల క్రితం 1996లో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడుకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, కాజల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో కేరళకు చెందిన ఆధునిక కళను పరిచయం చేయబోతున్నాడట దర్శకుడు శంకర్.

 

 

భారతీయుడు సినిమాలో ప్రాచీన పోరాట విద్య మర్మకళను శంకర్ చూపించాడు. ఇప్పుడు భారతీయుడు2కు కూడా అటువంటి కళను పరిచయం చేయబోతున్నాడట. ఆధునిక కళ అయిన ‘కరాళిపయాట్టు’ ను ఈ సినిమాలో చూపించబోతున్నాడట. ఈ ఫైట్స్ సినిమాకు హైలైట్ గా నిలిచే అవకాశం ఉందంటున్నారు. భారతీయుడు సినిమా ప్రస్తావన వస్తే మర్మకళ స్ఫురణకు వస్తుంది. ఆ మెళకువలతో కమల్ హాసన్ చేసిన ఫైట్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ ప్రాచీన కళను సినిమాలో ఉపయోగించడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయింది. మర్మకళను కేరళలో అతి ప్రాచీనమైన కళగా పరిచయం చేశాడు శంకర్.

 

 

ఈ కళకు సంబంధించి కమల్ హాసన్ తో పాటు హీరోయిన్ కాజల్ పై కూడా ఫైట్ ఉంటుందని అంటున్నారు. కాజల్ ఈ విద్యలో శిక్షణ తీసుకుంటోందని చెన్నై ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. భారతీయుడులో సంచలనం సృష్టించిన మర్మకళ తరహాలోనే ఈ ‘కళారి’ విద్య ఎంత ఫేమస్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం కరోనా వైరస్ తో షూటింగ్ లు అన్నీ బంద్ అయిపోయాయి. ఈ పరిస్థితుల్లో హీరో, హీరోయిన్లు, డైరక్టర్లు అందరూ షూటింగ్ ప్రారంభమయ్యాక ఏమేం చేయాలో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు కుదుటపడ్డాక ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది.

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: