సూపర్ స్టార్ మహేష్ బాబుకి  తన తండ్రి అంటే చాల ఇష్టం. తాజాగా మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట జీవితంపై ఇంస్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. సూపర్ స్టార్ కృష్ణ అంటే మహేష్ కి చాలా ఇష్టం, అభిమానం అని ప్రత్యేకంగా తెలియచేయవలసిన అవసరం లేదు.  ఇక మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత వచ్చి తనకంటూ ఒక మంచి  పేరు సంపాదించు కోవడంతో పాటు సూపర్ స్టార్‌గా ఎదిగారు కృష్ణ గారు. 

 

 


సూపర్ స్టార్ కృష్ణ సరిగ్గా 55 సంవత్సరల ముందు ‘తేనే మనసులు’ సినిమాతో హీరోగా ఇండియాస్ట్రీకి  పరిచయం అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో 'తేనే మనసులు’ సినిమా గురించి అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఈ పోస్ట్ ద్వారా మహేష్ బాబు తన ఆల్ టైమ్  ఫేవరేట్  సినిమాగా నిలుస్తుంది అని తెలియచేయడం జరిగింది. అప్పటిలో ఈ సినిమా తొలి కలర్ సాంఘిక చిత్రంగా మంచి పేరు కూడా లభించింది అని తన భావన తెలిపారు మహేష్ బాబు. అలాగే ఈ సినిమాతో  సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రయాణం మొదలైంది అంటూ  పోస్ట్ లో తెలియచేయడం జరిగింది.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My all time favourite❤️ #timelessclassic #TeneManasulu #Repost • @mbofficialteam Our Evergreen SuperStar krishna garu's journey begun on this day 55 years back with TENE MANASULU. What a blockbuster beginning. 👏👏👏 Let's take a moment to go back to the legendary journey of our SUPERSTAR. 🤩 #55YrsForTeneManasulu

A post shared by mahesh Babu (@urstrulymahesh) on

 


ఇకపోతే ‘తేనే మనసులు’ సినిమా  గురించి వస్తే.. ఈ సినిమాను ఆదుర్తి సుబ్బారావు డైరెక్టర్ గా వ్యవహరించారు. తెలుగు సినిమా పరిశ్రమ కళాతపస్వి కే.విశ్వనాథ్ అసిస్టెంట్ డైరెక్టర్‌ గా ఈ సినిమాకు పనిచేయడం జరిగింది. ఈ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణతో పాటు రామ్ మోహన్, సుకన్య, సంధ్యారాణిలు కూడా  పరిచయమయ్యారు. అలాగే ఈ సినిమాని ఆదుర్తి సుబ్బారావు  తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాకు కే.వి. మహదేవన్‌ సంగీతాన్ని అందించారు. 

 


సినిమా మొదలు పెట్టే సమయానికి సూపర్ స్టార్ కృష్ణకి కేవలం 22 సంవత్సరాలు మాతమ్రే. ఇక హీరోయిన్స్‌ గా కృష్ణ పక్కన సుహాసిని, జయప్రద వెండితెరని పంచుకున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ఇద్దరు కలిసి పది సినిమాల వరుకు వీరు నటించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: