బిగ్‌బాస్‌-3తో తెలుగునాట ప్రేక్ష‌కులంద‌రికీ ప‌రిచ‌య‌మైపోయిన పున‌ర్న‌వి భూపాలం తాజాగా హాట్ హీరోయిన్‌గా మారేందుకు భారీగానే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందుకోసం కావాల్సిన శ‌రీరాకృతిపై అమ్మ‌డు కాస్త ఎక్కువ‌గానే దృష్టి పెట్టిన‌ట్లుంది. అందుకే గంట‌లు గంట‌లు జిమ్‌ల్లో వ‌ర్క‌ట్స్ చేస్తూ ఒంపు సొంపుల‌కు సాన బెడుతోంది. తాజాగా  ఈ తెలుగు హీరోయిన్ వ‌ర్క‌వుట్స్ చేస్తున్న ఓ వీడియో త‌న సోష‌ల్ మీడియాలో పెట్టేసింది. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. ‘ఉయ్యాల జంపాలా’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘ఎందుకో ఏమో’ ఇలాంటి చిత్రాల్లో నటించింది. అయితే అనుకున్నంత గుర్తింపు మాత్రం ఈ సినిమాల ద్వారా పున‌ర్న‌వికి రాలేద‌నే చెప్పాలి. 

 

అయితే  ‘బిగ్ బాస్’ షోతో మాత్రం ఈ హీరోయిన్ రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. గ్లామర్ డాల్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి 11 వారాలు పాటు కలర్ ఫుల్ లుక్స్‌తో బిగ్ బాస్ హౌస్‌తో పాటు ఆడియన్స్‌కి హాట్‌నెస్ అందించింది. ఇక బిగ్‌బాస్ సీజ‌న్ టైటిల్ ద‌క్క‌క‌పోయిన తనతో లవ్ ట్రాక్ నడిపిన రాహుల్‌కి సపోర్ట్ చేసి అత‌డి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది.  ఈ విషయాన్ని బిగ్ బాస్ విన్నర్ రాహుల్ పలు సందర్భాల్లో కూడా గుర్తు చేస్తుంటాడు. అయితే బిగ్‌బాస్ త‌ర్వాత వ‌చ్చిన క్రేజీని హీరోయిన్‌గా అవ‌కాశాలు ద‌క్కించుకునేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా అవ‌కాశాల్లేవ‌నే చెప్పాలి.

 

 అందుకే అమ్మ‌డు కాస్త బోల్డ్‌గా క‌నిపించి ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌ను, హీరోల‌ను ఆక‌ర్షించాల‌ని భావిస్తోందంట‌. అన్న‌ట్లు ఆ మ‌ధ్య‌లో చాలా హాట్ హాట్‌గా క‌నిపించే ఫొటో షూట్ కూడా కంప్లిట్ చేసి పండ‌గ చేసుకోండి అంటూ సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది ఈ అమ్మ‌డు.ఇంత చేసినా మ‌రి పున‌ర్న‌వికి అవ‌కాశాలు వ‌స్తాయో రాదో వేచి చూడాలి మ‌రి.  గ్లామర్ ఫీల్డ్‌లో రాణించాలంటే ఫిట్ నెస్ తప్పనిసరైన పరిస్థితుల్లో ఒళ్లు కూడా ఒంచక తప్పదు మరి. అన్నట్టు పునర్నవి భూపాలం నటించిన సైకిల్, ఒక చిన్న విరామం చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: