ప్రస్తుతం కరోనా వ్యాధి భయం వలన పలు దేశాలు పూర్తిగా లాకౌట్ చేయబడడంతో పాటు ప్రజలను పూర్తిగా తమ ఇళ్లకే పరిమితం చేసేలా ప్రభుత్వాలు గట్టిగా చర్యలు చేపట్టాయి. ఈ మహమ్మారి మరింతగా ప్రభల కుండా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా భారత దేశాన్ని మొత్తం 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ లాకౌట్ వలన చాలావరకు కరోనా వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉండదని భావించిన భారత్, ముందుగానే లాకౌట్ ప్రకటించడం మంచిదయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
అయితే ఈ లాకౌట్ వలన దిగువ, పేద వర్గాల ప్రజలకు మాత్రం ఉపాధి లేక ఎన్నో అవస్థలు పడడంతో పాటు, మరికొందరు అట్టడుగు వర్గాల వారు అయితే కనీసం పట్టెడు అన్నం కూడా తినలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

 

అయితే అటువంటి వారి కోసం ప్రభుత్వాలు ఆర్ధిక ప్యాకెజీ ప్రకటించినప్పటికీ, పలు రంగాల వారు సైతం అటువంటి వారిని ఆదుకునేందుకు సహృదయంతో ముందుకు వస్తూ విరివిగా విరాళాలు ఇవ్వడం జరుగుతోంది. ఇక ఇప్పటికే కరోనా బారిన పడి ఆర్ధికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం టాలీవుడ్ నుండి కూడా చాలామంది ప్రముఖులు విరాళాలు అందించగా, ప్రస్తుతం తనవంతుగా ప్రజలకు వీలైన సాయం చేయాలనే సదుద్దేశయంతో ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకపై శనివారం, సోమవారం, బుధవారం, గురువారాల్లో తన అఫీషియల్ ఫేస్ బుక్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నారు. 

 

IHG

 

అంతేకాక ఆ లైవ్ లో నెటిజన్లు కోరిన పాటలను బాలు ఆలపించనున్నారు. ఎవరైతే బాలు గారి నుండి పాట కోరనున్నారో, అటువంటి వారు ఎస్పీబీ ఫ్యాన్స్ చారిటబుల్ ఫౌండేషన్ సంస్థకు కనీసం రూ.100 నుండి తమ శక్తి కొలది డబ్బును డిపాజిట్ చేయవలసి ఉంటుంది. కాగా ఈ డబ్బును ఎస్పీబీ ఫ్యాన్స్ ఫౌండేషన్ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు, అలానే అన్నార్తులకు ఉపయోగిస్తుంది. బాలు గారు చేపట్టిన ఈ సరికొత్త కార్యక్రమం ఎంతో బాగుందని, తప్పకుండా ప్రజల నుండి ఈ కార్యక్రమాన్ని మంచి స్పందన లభించడంతో పాటు విరాళాలు కూడా బాగానే వస్తాయని ఫౌండేషన్ వారు ఆశిస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: