టాలీవుడ్ లో ఇప్పటి వరకు వరుస విజయాలు అందుకుంటున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు.  ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.   అందుకు సంబంధించిన  స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు  ఈ మద్య కొత్త దర్శకులు మంచి కంటెంట్ తో వస్తు మంచి విజయాలు అదుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్ తో ఎన్టీఆర్మూవీ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఒక కథను వినిపించినట్టుగా చెప్పాడు. ఎన్టీఆర్ నుంచి సమాధానం రావలసి వుంది. తరుణ్ భాస్కర్ వైవిధ్యభరితమైన కథలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు. ఆయన టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. తనదైన స్టైల్లో ఎన్టీఆర్ ను చూపించడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడు.  విజయ్ దేవరకొండ హీరోగా ‘పెళ్లిచూపులు’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  ఈ మూవీ విజయ్ దేవరకొండకు మంచి పేరు తీసుకు రావడమే కాదు.. తరుణ్ భాస్కర్ కి కూడా మంచి పేరు తీసుకు వచ్చింది. 

 

మొదటి సినిమాతోనే డైరెక్టర్, హీరో కి ‘పెళ్లిచూపులు ’ సూపర్ సక్సెస్ ఇచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓకే అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఆ రెండు అక్షరాలు ఆయన నోటి నుంచి వచ్చే క్షణం కోసమే తరుణ్ భాస్కర్ ఎదురుచూస్తున్నాడు. ఎన్టీఆర్ ఏమంటాడో చూడాలి.  విభిన్నమైన సినిమాలు తెరకెక్కిస్తున్న తరుణ్ భాస్కర్ ఈ మద్య హీరోగా కూడా నటిిస్తున్నాడు. వెండి తెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నా.  ఓ కార్యక్రమంలో సెలబ్రెటీలతో తమ జీవితంలో జరిగిన విశేషాలు పంచుకుంటున్నారు.  మరి తరుణ్ భాస్కర్ తో ఎన్టీఆర్ ఓకే అంటే యంగ్ డైరెక్టర్ కి మంచి భవిష్యత్ దొరికినట్లే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: