ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోతున్నాయి. ఇక ఈ ప్ర‌భావం సినిమా రంగంపై కూడా తీవ్రంగా ప‌డింది. ఇప్ప‌టికే చైనాతో పాటు అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్‌.. నుంచి సౌత్‌లో అన్ని భాష‌ల్లో సినిమా ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. ఇటు సినిమా షూటింగ్‌లతో పాటు రిలీజ్ ఆగిపోయాయి. థియేట‌ర్ల‌ను మూసివేశారు. మ‌ళ్లీ ఇవి ఎప్ప‌ట‌కి తెరుస్తారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. సినిమా ప‌రిశ్ర‌మ‌కు కోట్లాది రూపాయ‌లు న‌ష్టం వాటిల్లుతోంది.

 

టాలీవుడ్‌లోనూ క‌రోనా వ‌ల్ల రు. 400 కోట్లు న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ప్రభావంతో ఎన్నో సినిమాల విడుదల నిలిచిపోగా, షూటింగ్‌ లు ఆగిపోవడంతో సినీ కార్మికులకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. టాలీవుడ్‌ లో మిగతా నిర్మాతలతో పోలిస్తే, దిల్ రాజుకే కరోనా కారణంగా అత్యధిక నష్టం ఏర్పడిందని టాలీవుడ్ వర్గాల టాక్. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కే వీ సినిమా ఉగాది కానుక‌గా మార్చి 25న రావాలి. ఆ సినిమాపై రు. 40 కోట్ల బెట్ ఉంది.

 

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్‌పై పెట్టిన పెట్టుబ‌డి రు. 30 కోట్లు అంటున్నారు. ఈ సినిమా మే నెల‌లో రావాలి. ఇప్ప‌టికే షూటింగ్ ఆగిపోవ‌డంతో భారీ న‌ష్టం ఏర్ప‌డేలా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో థియేటర్లు ఆయన అధీనంలో ఉండగా, వాటి నుంచి వచ్చే ఆదాయం నిలిచిపోయింది. అయినా సిబ్బందికి వేతనాలు చెల్లించాల్సి రావడం ఆయనపై పడ్డ మరో భారం. నెల‌కు ఈ జీతాలు... మెయింటైన్స్ రు. 3 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. ఏదేమైనా క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల మొత్తానికి అంద‌రి కంటే దిల్ రాజుకే భారీ న‌ష్టం వాటిల్లింద‌ని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: