ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. రాష్ట్రంలో కరోనా వైరస్ తాకిడి ఎక్కువ కావడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. చిత్రం జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం ఇంటికే పరిమితం కావడంతో సమయానికి సినిమా రిలీజ్ అవుతుందో లేదో అన్న ఆందోళన నెలకొంది.

 

అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన అరవింద సమేత సినిమా చాలా మంచి విజయాన్ని సాధించింది. ఆర్ఆర్ఆర్  సినిమాను దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ త్రివిక్రమ్ కు డేట్లు కూడా ఇచ్చేశాడు. వచ్చే ఏడాది వేసవి సెలవులను టార్గెట్ చేసుకొని సినిమా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఇద్దరూనూ.

 

అయితే చిత్రానికి సంబంధించిన హీరోయిన్ ను త్రివిక్రమ్ బాలీవుడ్ నుండి తీసుకుని వచ్చే యోచనలో ఉన్నాడట. పాత్రకి తగ్గట్టు చాలా కొత్త ముఖం చిత్రానికి కావాలని తెలుస్తోంది.

అంతేకాకుండా  'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పెట్టాలని కూడా పరిశీలన చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ కోసం స్టార్ హీరోయిన్ అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ని రంగంలోకి దించడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించి హీరోయిన్ క్యారెక్టర్ కి సంబంధించి అన్ని విషయాలు జాన్వికపూర్ తో త్రివిక్రమ్ చర్చలు జరిపినట్లు ఫిలింనగర్ లో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: