కరోనా ప్రభావానికి వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ప్రజలంతా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితులకు సినీ ఇండస్ట్రీలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులు కూడా ఉన్నారు. సినిమా షూటింగులు ఉంటేనే ఉపాధి లభించే కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు కలిపి తెలుగులో వేల సంఖ్యలో ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో వీరందరిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి 'కరోనా క్రైసిస్ చారిటీ' ని నెలకొల్పిన విషయం తెలిసిందే.

 

 

ఇందులో భాగంగా తొలిగా కోటి రోపాయల విరాళం ప్రకటించిన చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినీ పరిశ్రమ మొత్తం కదిలొచ్చింది. ఈ ‘సీసీసీ’ కోసం నాగార్జున, సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి కూడా చెరో కోటి ప్రకటించారు. ప్రభాస్, మహేశ్, చరణ్, ఎన్టీఆర్, నాని, శ్రీకాంత్, కార్తికేయ, విశ్వక్ సేన్, సంపూర్ణేష్ బాబు.. ఇలా ఎందరో హీరోలు విరాళం ప్రకటించారు. దిల్ రాజు, మైత్రీ మూవీస్.. ఇలా ఎన్నో నిర్మాణ సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా విరాళం ప్రకటించారు. ఈ ‘సీసీసీ’ కి చైర్మన్ గా ఉన్న చిరంజీవి ఇప్పటి వరకూ వచ్చిన విరాళాలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివీల్ చేశారు. ‘ఇప్పటి వరకూ 6.2 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇందుకు స్పందించిన దాతలందరికీ కృతజ్ఞతలు’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 

 

ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇకపై విరాళాలు ఇచ్చే వారు ఆ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని కోరారు. చిరంజీవి చైర్మన్ ఉన్న ‘సీసీసీ’ లో మెంబర్లుగా తమ్మారెడ్డి భరద్వాజ్, దర్శకుడు శంకర్ వంటి వారు సెక్రటరీలుగా ఉన్నారు. చిరంజీవి ఈ తరహా కార్యక్రమానికి ముందుగా స్పందించడంతో మరింత ఎఫెక్టివ్ గా సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇకపై కూడా మరిన్ని విరాళాలు వచ్చ అవకాశం ఉంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: