కాజల్ అగర్వాల్..సినిమా ఇండస్ట్రీలో లాంగ్ టైం కొనసాగిన టాప్ హీరోయిన్స్ లో ఈ పేరు ఖచ్చితంగా ఉంటుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో కెరీర్ మొదలై ఇప్పటికి 12 ఏళ్ళవుతున్నప్పటికీ క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. రేస్ లో కాస్త వెనకపడ్డప్పటికి మళ్ళీ జోరందుకుంది. ఒకవైపు యంగ్ హీరోలతో నటిస్తూనే మరోవైపు సినీయర్ స్టార్ హీరోలతోను ఛాన్సులు దక్కించుకుంటుంది. కాజల్ ప్రస్తుతం 'ముంబై సాగా' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' సినిమాలో కనిపించనుంది. 

 

ఇక తాజాగా కాజల్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో మరోసారి చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇప్పటికే మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న కాజల్ కి మరో భారీ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుందని కోలీవుడ్ మీడియా సమాచారం. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, మురుగదాస్ కాంబినేషన్‌లో త్వరలో 'తుపాకి 2' మొదలుకానుందని లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటించనుందని తాజా సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన తుపాకి మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. 

 

సినిమా తర్వాత కాజల్ విజయ్ కలిసి మరోసారి జిల్లా సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా మంచి హిట్ ని సాధించింది. ఆ తర్వాత విజయ్, కాజల్ మెర్సెల్ సినిమాలో నటించి హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. దాంతో ఈ జంట కి హిట్ పేయిర్ అన్న ముద్ర పడింది. అందుకే ఇప్పుడు మురగదాస్ 'తుపాకి 2' లో కాజల్ ని ఎంచుకున్నారట. అయితే ఈ విషయం ఇంకా కాజల్ బయట పెట్టనప్పటికి కోలీవుడ్ మీడియాలో మాత్రం బాగా స్ప్రెడ్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: