భారతదేశంలో రామాలయం లేని ఊరు ఉండదని ప్రతీతి. హిందువుల పండగల్లో శ్రీరామనవమికి ఉండే ప్రత్యేకతే వేరు. చలువ పందిళ్లలో వేద మంత్రాల మధ్య జరిగే సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షిస్తారు భక్తులు. రామయ్య కల్యాణం అంటే ప్రతి ఇంటి సందడి కిందే లెక్క.  ఇంతటి విశిష్టత ఉన్న సీతారాముల కల్యాణ ఘట్టాన్ని అంతే అందంగా చాలా తెలుగు సినిమాల్లో తెరకెక్కించారు. అటువంటి అద్భుతమైన చిత్ర రాజాల్లో ఒకటి ‘సంపూర్ణ రామాయణం’. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ క్లాసిక్ గా మిగిలిపోయింది.

IHG

 

శోభన్ బాబు రాముడిగా చంద్రకళ సీతగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో చాల పెద్ద హిట్ సినిమాగా నిలిచింది. అప్పటికే శ్రీరాముడిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ కాకుండా మరో నటుడితో శ్రీరాముడి వేషం వేయించడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ సినిమాలో శోభన్ బాబు శ్రీరాముడిగా నటించడానికి ముందు ఎన్టీఆర్ ను కలిసి ఆయనకు ఓ మాట చెప్పి గానీ మేకప్ వేసుకోలేదట. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయేలా బాపు – రమణల జంట ఈ సినిమాను అత్యంత అందంగా మెరుగులు దిద్దారు. ప్రతి రోజు షూటింగ్ లో శోభన్ బాబు, చంద్రకళకు దిష్టి కూడా తీసేవారట.

IHG

 

ఈస్ట్ మన్ కలర్ లో తీసిన ఈ సినిమాలో శోభన్ బాబు, చంద్రకళ మరింత అందంగా కనిపించారు. సీతారాములుగా వీరిద్దరి జంటను చూసిన ప్రేక్షకులు ధియేటర్లలో హారతులు పట్టేవారు. నిజంగా సీతారాములే వచ్చిన భావనను ప్రేక్షకులు పొందారు. 1971లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. రావణుడిగా ఎస్వీ రంగారావు నటించారు. కేవీ మహదేవన్ సంగీతంలోని అన్ని పాటలు హిట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: